»Ys Avinash Reddy Release A Video On Ys Vivekananda Reddy Murder Case
Viveka Caseలో Letter ఎందుకు దాస్తున్నారు? CBIపై అవినాశ్ రెడ్డి ఆగ్రహం
లేఖ దాచడంపై అడిగితే రాజశేఖర్ రెడ్డి చెప్పిన జవాబు హాస్యాస్పదం. డ్రైవర్ ప్రసాద్ మంచోడు, అతడి గురించి వివేకా లేఖ రాశారని తెలిస్తే ప్రసాద్ పై దాడి చేస్తారనే లేఖ దాచినట్టు రాజశేఖర్ రెడ్డి నాకు చెప్పాడు. మీ నాన్న కంటే డ్రైవర్ ప్రసాద్ నే నమ్ముతారా? ఆ లేఖపై సీబీఐ ఎందుకు దృష్టి సారించడం లేదో అర్థం కావడం లేదని అవినాశ్ రెడ్డి సందేహం వ్యక్తం చేశాడు.
తన బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐ (CBI) ముమ్మరం చేసింది. త్వరలోనే ముగింపు పలకనున్న నేపథ్యంలో రోజుకో పరిణామం చోటుచేసుకుంటోంది. వీటిలో ప్రధానంగా వైఎస్సార్ సీపీ (YSRCP) ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి (YS Avinash Reddy) ప్రధాన హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధాన నిందితుడు అవినాశ్ రెడ్డి అనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అవినాశ్ పై సీబీఐ దర్యాప్తు (Investigation) ముమ్మరం చేసింది. అయితే కోర్టు బెయిల్ తో అరెస్ట్ కాకుండా ప్రస్తుతం అవినాశ్ బయట తిరుగుతున్నాడు. అతడి చుట్టూ ఉచ్చు బిగిస్తుండడంతో అవినాశ్ గురువారం ఓ వీడియో (Video) విడుదల చేశారు. హత్య జరిగిన రోజు తాను ఏం చేశానోనని ఆ వీడియోలో తెలిపాడు.
వీడియోలో అవినాశ్ మాటలు ఇలా ఉన్నాయి. ‘వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగిందో ప్రజలకు తెలియాలి. వివేకా మరణించినట్లు శివప్రకాశ్ రెడ్డి (Shivaprakash Reddy) నాకు చెప్పారు. నేను అప్పటికే జమ్మలమడుగుకు (Jammalamadugu) వెళ్తున్నా. పులివెందుల రింగ్ రోడ్డు దగ్గర ఉన్నప్పుడు వివేకా హత్య జరిగినట్లు ఫోన్ వచ్చింది. ఏమైనా అనుమానాస్పదంగా ఉన్నాయి అని నేను అడిగా. నేను వెళ్లకముందే వివేకా రాసిన లేఖ (Letter), సెల్ ఫోన్ (Cellphone)ను దాచేశారు. డ్రైవర్ ను ప్రసాద్ ను వదిలిపెట్టొద్దు అని వివేకా లేఖ రాశారు. లేఖ, సెల్ ఫోన్ దాచమని రాజశేఖర్ రెడ్డి చెప్పారు. వివేకా హత్య కేసులో ఆ లేఖనే కీలకం. అలాంటి లేఖను ఎందుకు దాచారు?’ అని ప్రశ్నించాడు.
ఆ లేఖలోనే మొత్తం అంశాలు దాగి ఉన్నాయని అవినాశ్ తెలిపాడు. ఈ సందర్భంగా సీబీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘లేఖ దాచడంపై అడిగితే రాజశేఖర్ రెడ్డి చెప్పిన జవాబు హాస్యాస్పదం. లేఖలో డ్రైవర్ ప్రసాద్ తనపై దాడి చేశారని వివేకా రాశారు. డ్రైవర్ ప్రసాద్ మంచోడు, అతడి గురించి వివేకా లేఖ రాశారని తెలిస్తే ప్రసాద్ పై దాడి చేస్తారనే లేఖ దాచినట్టు రాజశేఖర్ రెడ్డి నాకు చెప్పాడు. మీ నాన్న కంటే డ్రైవర్ ప్రసాద్ నే నమ్ముతారా? ఆ లేఖపై సీబీఐ (CBI) ఎందుకు దృష్టి సారించడం లేదో అర్థం కావడం లేదు. ఎవరిని కాపాడేందుకు ఇదంతా చేస్తున్నారు? అని వీడియోలో అవినాశ్ రెడ్డి ప్రశ్నించాడు.