»Vinaro Bhagyamu Vishnu Katha Day 1 Collections Worldwide
vinaro bhagyamu vishnu katha: డే1 కలెక్షన్స్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన వినరో భాగ్యము విష్ణు కథ మూవీ శనివారం(ఫిబ్రవరి 18న) విడుదల కాగా...తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 2.75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన వినరో భాగ్యము విష్ణు కథ(vinaro bhagyamu vishnu katha) మూవీ శనివారం(ఫిబ్రవరి 18న) విడుదల కాగా..ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రం అనేక అంచనాలను ఆశ్చర్యపరిచే విధంగా చాలా ప్రాంతాలలో మంచి కలెక్షన్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో వినరో భాగ్యము విష్ణు కథ మొదటి రోజు(day 1 collections) ప్రపంచవ్యాప్తంగా 2.75 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని మేకర్స్ ప్రకటించారు. రానున్న రోజుల్లో ఈ సినిమా మరింత వసూళ్లు రాబట్టనుందని పేర్కొన్నారు. అంతేకాదు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఇచ్చినందుకు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు కూడా తెలిపారు.
దీంతో కిరణ్ అబ్బవరం(KiranAbbavaram) కెరీర్లో ఈ చిత్రం అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. సీడెడ్ లో దాదాపు 40 లక్షలను తెచ్చిపెట్టగా.. ఓవరాల్గా ఈ చిత్రం కేవలం తెలుగు రాష్ట్రాల్లో 2.5 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలిసింది. మిగిలిన ప్రాంతాల నుంచి దాదాపు రూ.25 లక్షల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. మురళీ శర్మ(murali sharma) కీలక పాత్రలో నటించిన ఈ ఎంటర్టైనర్లో కిరణ్ అబ్బవరం, కాశ్మీర(kashmira pardeshi) హీరో హీరోయిన్లుగా నటించారు. కిరణ్ అబ్బవరం నటన, మురళీ శర్మ అద్భుతమైన యాక్టింగ్ విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలను పొందారు.
ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు(murali kishore abburu) దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్(bunny vasu) ఈ చిత్రాన్ని నిర్మించారు. డేనియల్ విశ్వాస్ ఛాయాగ్రహణం, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ మ్యూజిక్(Music) అందించారు. ఈ మూవీలో ఆమని, శుభలేఖ సుధాకర్, మురళీ శర్మ, ఎల్బీ శ్రీరామ్ వంటివారు ప్రధాన పాత్రల్లో నటించారు.