జూన్ 16న రిలీజ్ అయిన ఆదిపురుష్ మూవీ గురించి.. ఇంకా ఏదో ఒక వివాదం నడుస్తునే ఉంది. అయినా కూడా ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. ఇక ఆదిపురుష్ థియేటర్లోకి వచ్చింది.. సక్సెస్ అయిపోయింది కాబట్టి.. నెక్స్ట్ హనుమాన్ టైం స్టార్ట్ అయిపోయినట్టే. తాజాగా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న హనుమాన్ మూవీ(Hanuman movie) కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో.. తేజ సజ్జా హీరోగా మీడియం రేంజ్‌తో బడ్జెట్‌తో హనుమాన్(Hanuman) అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం చాలాసార్లు వాయిదా పడింది. అయితే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆదిపురుష్ గ్రాఫిక్స్‌తో హనుమాన్ గ్రాఫిక్స్‌ను పోల్చడంతో.. హనుమాన్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆదిపురుష్ కంటే హనుమాన్ బెటర్.. అనే టాక్ సొంతం చేసుకుంది. అందుకే హనుమాన్ సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయింది. కానీ గ్రాఫిక్స్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. ముందుగా మే 12న రిలీజ్ చేయాలనుకున్నారు.
అయితే ఆదిపురుష్ రిజల్ట్‌ను బట్టి హనుమాన్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవచ్చు.. అప్పటి వరకు గ్రాఫిక్స్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు.. అందుకే.. హనుమాన్ను పోస్ట్ పోన్ చేశారు. అయితే తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఆగస్టు 25వ తేదీన హనుమాన్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే థియేటర్ల కోసం కసరత్తులు స్టార్ట్ చేశారట మేకర్స్. జూలై ఫస్ట్ వీక్‌లో రిలీజ్ డేట్(release date)పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రీలిజ్ చేయనున్నారు. సూపర్ హీరో కథతో హనుమాన్(Hanuman movie) రాబోతోంది. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా పై అంచనాలు బాగానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం విఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ. బాల హనుమాన్కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ పిక్‌ని కూడా షేర్ చేసాడు. దీంతో హనుమాన్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్.