»The Minister Buggana Rajendra Prasad Said That Rates Were Increased To Reduce Liquor Sales 2023
Minister Guggana: మద్యం సేల్స్ తగ్గించేందుకే రేట్లు పెంచాం
మద్యం వినియోగం తగ్గించడానికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(ap government) మద్యం ధరలను(liquor prices) పెంచినట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి(minister buggana rajendra prasad) తెలిపారు. ఈ క్రమంలో 2019 నుంచి ఇప్పటివరకు ఆల్కహాల్ వినియోగం 38 శాతం తగ్గినట్లు వెల్లడించారు. మరోవైపు తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర వంటి అనేక రాష్ట్రాల కంటే ఏపీలో ఆర్థిక లోటు మెరుగ్గా ఉందని బుగ్గన స్పష్టం చేశారు.
మద్యం వినియోగాన్ని తగ్గించేందుకే ఏపీ ప్రభుత్వం(ap government) ధరలు(prices) పెంచిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి(minister buggana rajendra prasad) అన్నారు. 2019 నుంచి ఇప్పటివరకు మద్యం వినియోగంలో 38% తగ్గుదల, బీర్ల వినియోగంలో 5% తగ్గుదల ఉందని ఆయన చెప్పారు. ఈ క్రమంలో మొత్తంగా వినియోగం తగ్గినట్లు గుర్తు చేశారు. ఏపీ బడ్జెట్(ap budget 2023) సమావేశాల్లో భాగంగా శుక్రవారం వెల్లడించారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్(YSRCP) ప్రభుత్వానికి ప్రజల సంక్షేమమే ముఖ్యమని అన్నారు. గత నాలుగేళ్లలో వచ్చిన బడ్జెట్లు దానిని రుజువు చేశాయని వెల్లడించారు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులను తొలి ఏడాదిలోనే క్లియర్ చేయాలని ఈ ప్రభుత్వం ఒత్తిడి చేసినా…సంక్షేమ పథకాల విషయంలో జగన్ మోహన్ రెడ్డి రాజీ పడలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండో సంవత్సరంలో COVID-19 మహమ్మారిని పటిష్టంగా ఎదుర్కొన్నట్లు తెలిపారు.
టీడీపీ నేతలు లేవనెత్తిన సందేహాలకు రాజేంద్రనాథ్ రెడ్డి(rajendra prasad) వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయని సమాధానం ఇచ్చారు. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి 2022-23 వరకు కేంద్ర పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రాష్ట్ర ఎక్సైజ్, అమ్మకాలపై పన్నులు, మద్యం, పెట్రోల్‌పై వ్యాట్, వాహన పన్నుల(taxes) వాటాకు సంబంధించి గణనీయమైన వృద్ధి నమోదైనట్లు చెప్పారు.
2014 నుంచి 2019 మధ్య అప్పులు 19% పెరిగాయని.. అయితే ప్రస్తుత పాలనలో పెరుగుదల 13.5% మాత్రమే ఉన్నాయని తెలిపారు. మరోవైపు మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ వంటి అనేక రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక లోటు మెరుగ్గా ఉందని ఆయన అన్నారు. గత నాలుగేళ్లలో ప్రభుత్వం దాదాపు రూ.1.97 లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ(DBT) చేసిందని వెల్లడించారు. ప్రభుత్వ విధానాలతో స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP) బాగా పెరిగిందన్నారు.
ఏపీలో దాదాపు 62% జనాభా వ్యవసాయ(agriculture) రంగంపై ఆధారపడి ఉన్నట్లు చెప్పారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం(ap government) దానిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. RBKలు, పొలం బడి వంటి కార్యక్రమాలు రైతులకు ఇన్పుట్ ఖర్చును తగ్గించడంలో సహాయపడుతున్నాయన్నారు. దీంతోపాటు రైతులకు కనీస మద్దతు ధర అందించేందుకు రూ.3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధిని వినియోగిస్తున్నట్లు చెప్పారు.