మీ ఉద్యమంలో న్యాయం ఉంది... మీ వైపే ధర్మం ఉంది. అందుకే ఆంక్షలు, వేధింపులు, సంకెళ్లను ఎదిరించి మీరు ముందుకు సాగుతున్నారు. అంతిమంగా గెలిచేది, నిలిచేది అమరావతే!’
మూడు రాజధానుల (Three Capitals)కు వ్యతిరేకంగా అమరావతి రైతులు (Amaravati Farmers Movement) సాగిస్తున్న పోరాటానికి వెల్లువలా మద్దతు లభిస్తోంది. నిర్విరామంగా రోజులు.. నెలలు.. సంవత్సరాల తరబడి చేస్తున్న వారి పోరాటం 1200 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party-TDP), కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇతర ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. రాజధానిగా అమరావతి కొనసాగించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. కాగా వీరి ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అండగా నిలిచారు.
రాజధాని ప్రాంత రైతుల ఉద్యమం 1200 రోజుల మైలురాయికి చేరుకోవడంతో చంద్రబాబు ట్విటర్ (Twitter)లో స్పందించారు. ఈ సందర్భంగా అలుపెరగని పోరాటం చేస్తున్న రైతులను అభినందించారు. ‘రాజధాని రైతుల 1200 రోజుల పోరాటానికి అభినందనలు. మీ ఉద్యమంలో న్యాయం ఉంది… మీ వైపే ధర్మం ఉంది. అందుకే ఆంక్షలు, వేధింపులు, సంకెళ్లను ఎదిరించి మీరు ముందుకు సాగుతున్నారు. అంతిమంగా గెలిచేది, నిలిచేది అమరావతే!’ అంటూ ట్వీట్ (Tweet) చేశారు.
అమరావతి రైతుల ఉద్యమానికి తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ మంచుమర్తి అనురాధ, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మాజీ మంత్రులు ఆది నారాయణరెడ్డి, కన్నా లక్ష్మీ నారాయణ, కాంగ్రెస్ నాయకులు గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ తదితరులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా రైతు దీక్షా శిబిరాన్ని సందర్శించి రైతులతో పాటు కూర్చున్నారు. అమరావతి రాజధాని కొనసాగాలంటూ టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు డిమాండ్ చేశాయి. అమరావతి రైతుల పోరాటానికి (Amaravati Farmers Movement) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) మద్దతు పలికారు. ‘అమరావతి నుంచి ఒక్క ఇటుక కూడా తీసుకెళ్లలేరు’ అని స్పష్టం చేశారు. రాజధానిగా అమరావతి కొనసాగాలని డిమాండ్ చేశారు. రైతుల పోరాటానికి తాను సంఘీభావం తెలుపుతున్నట్లు తెలిపారు.
రాజధాని రైతుల 1200 రోజుల పోరాటానికి అభినందనలు. మీ ఉద్యమంలో న్యాయం ఉంది… మీ వైపే ధర్మం ఉంది. అందుకే ఆంక్షలు, వేధింపులు, సంకెళ్లను ఎదిరించి మీరు ముందుకు సాగుతున్నారు. అంతిమంగా గెలిచేది, నిలిచేది అమరావతే!#1200DaysOfAmaravatiProtestspic.twitter.com/3fjPR3yoJi