»Ap Sri Rama Navami Utsav Cancelled Due To Ysrcp Objection In Nandyal District
Cheap Politics దేవుడితో రాజకీయం.. వైసీపీ తీరుతో రాములోరి కల్యాణం రద్దు
ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. రాజకీయాల కోసం దేవుడి ఉత్సవాలను రద్దు చేయడం దారుణంగా పలువురు పేర్కొంటున్నారు. వైసీపీ నాయకుల దౌర్జన్యాలు పెరుగుతున్నాయని టీడీపీ నాయకులు ఆరోపించారు. దేవుడితో రాజకీయాలు వద్దు అని హితవు పలికారు.
రాజకీయాలకు (Politics) ఒక హద్దు ఉంటుంది. హద్దు మీరి ప్రవర్తిస్తే వారికి ప్రజల నుంచి తీవ్ర పరాభవం ఎదురవక తప్పదు. ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) రెచ్చిపోతోంది. ప్రతిదీ రాజకీయం చేస్తూ వివాదాలకు కేంద్రంగా మారుతోంది. తాజాగా తమ పంతం కోసం ఏకంగా సీతారాముల కల్యాణోత్సవం రద్దు చేసే స్థాయికి ఆ పార్టీ అరాచకం కొనసాగింది. వైసీపీ నాయకులు దేవుడి ఉత్సవాలను కూడా రాజకీయం చేశారు. ఫలితంగా ఓ గ్రామంలో అంగరంగ వైభవంగా జరగాల్సిన శ్రీరామనవమి ఉత్సవాలు (Sri Rama Navami) ఆగిపోయాయి. ఈ సంఘటన నంద్యాల జిల్లాలో (Nandyal District) చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
నంద్యాల జిల్లా గడివేముల (Gadivemula) మండలం కె.బొల్లవరం గ్రామంలో ఆంజనేయ, వీరభద్రస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి గ్రామంలో 20 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి ద్వారా ఏడాదికి రూ.2 లక్షల కౌలు వస్తుండడంతో ప్రతి ఏడాది సీతారాముల ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేవారు. కాగా ఈసారి అర్చకుడి విషయంలో వైసీపీ నాయకులు రాజకీయం చేశారు. అర్చకుడిగా రాజన్నను తొలగించి వేరొకరిని నియమించాలని వైసీపీ నాయకులు పట్టుబట్టారు. అయితే ఆలయ అధికారులు అర్చకుడిని మార్చలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ పార్టీ నాయకులు తాము శ్రీరామనవమి ఉత్సవాలకు సహకరించలేమని స్పష్టం చేశారు. తాము లేనిది ఉత్సవాలు (Festival) ఎలా జరుగుతాయో చూస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
ఈ విషయమై ఆలయ ఈవో పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు వివరాలు తెలుసుకుని అధికార పార్టీకే వంత పాడారు. గ్రామంలో గొడవలు (Clashes) జరుగుతాయని చెప్పి ఏకంగా ఉత్సవాలను రద్దు (Cancelled) చేశారు. రాములోరి కల్యాణోత్సవాన్ని గురువారం నిర్వహించలేదు. శ్రీరామనవమి వేడుకలు లేక బొల్లవరం గ్రామం బోసిపోయింది. దేశవ్యాప్తంగా అందరూ సంబరంగా పండుగ చేసుకోగా ఈ ఒక్క గ్రామంలో పండుగ వాతావరణం లేదు. ఇది కేవలం అధికార పార్టీ రాజకీయం వలనే ఇలా జరిగిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. రాజకీయాల కోసం దేవుడి ఉత్సవాలను రద్దు చేయడం దారుణంగా పలువురు పేర్కొంటున్నారు. వైసీపీ నాయకుల దౌర్జన్యాలు పెరుగుతున్నాయని టీడీపీ నాయకులు ఆరోపించారు. దేవుడితో రాజకీయాలు వద్దు అని హితవు పలికారు.