»Jagan Delhi Tour Ys Jagan Meets To Amit Shah And Nirmala Sitharaman
YS Jagan Delhi Tour ఢిల్లీ నుంచి జగన్ తిరుగుముఖం.. ఎవరెవరిని కలిశారంటే..?
వ్యక్తిగత విషయాల కోసం కేంద్ర ప్రభుత్వానికి వినతులు జగన్ ఇస్తున్నాడని ఆరోపించింది. కేసుల నుంచి తనను తప్పించుకునేందుకు కేంద్ర మంత్రులను జగన్ వరుసగా కలుస్తున్నాడని తెలిపింది. అందుకే రెండు వారాల్లో రెండోసారి ఢిల్లీకి జగన్ వెళ్లాడని పేర్కొంటోంది.
ఏపీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) ఢిల్లీ పర్యటన (Delhi Tour) ముగిసింది. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి ఆయన తిరుగుముఖం పట్టారు. రెండు రోజుల పాటు దేశ రాజధానిలో గడిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah), కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman)తో సమావేశమయ్యారు. ప్రధాని మోదీతో సమావేశానికి ప్రయత్నించగా అపాయింట్ మెంట్ లభించలేదని తెలుస్తోంది. కాగా ఈ పర్యటనలో యథావిధిగానే పాత వినతులే ఇచ్చినట్లు తాడేపల్లి వర్గాలు వెల్లడించాయి.
రెండు వారాల్లో రెండోసారి.. అకస్మాత్తుగా దేశ రాజధాని న్యూఢిల్లీకి (New Delhi) సీఎం జగన్ వెళ్లాడు. రెండు వారాల్లోనే రెండోసారి హస్తిన పర్యటనకు జగన్ వెళ్లడం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మార్చి 16, 17వ తేదీన ఢిల్లీ పర్యటనకు వెళ్లిన జగన్ తాజాగా మార్చి 29, 30న పర్యటించారు. గత పర్యటనలో ప్రధాని మోదీ (Narendra Modi), అమిత్ షాని కలిసిన జగన్ ఈసారి ప్రధానిని కలువలేకపోయాడు.
మంగళవారం విశాఖపట్టణంలో జీ20 సదస్సుకు (G-20) హాజరైన అనంతరం అక్కడి నుంచి రాత్రి తాడేపల్లికి చేరుకున్నారు. బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో (Flight) ఢిల్లీ వెళ్లారు. బుధవారం రాత్రి అమిత్ షాను ఆగమేఘాల మీద కలిశారు. గురువారం మధ్యాహ్నం నిర్మలను కలిసిన అనంతరం ఏపీకి బయల్దేరారు. రాష్ట్రానికి సంబంధించిన వినతులు ఇచ్చారని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. కానీ సీఎం జగన్ ఇతర విషయాలపై చర్చించేందుకు కేంద్ర హోం శాఖ మంత్రితో సమావేశమైనట్లు తెలుస్తున్నది. ఎందుకంటే ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. చట్టపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. దర్యాప్తు సంస్థలు ఓ ముఖ్యమైన కేసు విషయంలో తనను ఇబ్బందులు పెట్టేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయంపైనే సీఎం జగన్ కేంద్ర పెద్దలకు విన్నవించినట్లు సమాచారం.
కాగా జగన్ పర్యటనను ప్రతిపక్షాలు విమర్శించాయి. ఢిల్లీ పర్యటనతో ఆంధ్రప్రదేశ్ కు ఒరిగేదేమీ ఉండదని తెలుగుదేశం పార్టీ పేర్కొంది. వ్యక్తిగత విషయాల కోసం కేంద్ర ప్రభుత్వానికి వినతులు జగన్ ఇస్తున్నాడని ఆరోపించింది. కేసుల నుంచి తనను తప్పించుకునేందుకు కేంద్ర మంత్రులను జగన్ వరుసగా కలుస్తున్నాడని తెలిపింది. అందుకే రెండు వారాల్లో రెండోసారి ఢిల్లీకి జగన్ వెళ్లాడని పేర్కొంటోంది. ఢిల్లీ పర్యటనతో రాష్ట్రానిక ఏం సాధించారో బహిర్గతం చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.