»Tdp Nara Lokesh Kia Challenge To Ys Jagan In Yuvagalam Padayatra
700 కి.మీ దాటిన Yuvagalam యాత్ర.. జగన్ కు నారా లోకేశ్ KIA చాలెంజ్
కంపెనీలు, పరిశ్రమల వద్ద సెల్ఫీలు తీసుకుని సీఎం జగన్ కు సవాల్ విసురుతున్నారు. ఇలాంటి కంపెనీలు మీరు తీసుకురాగలరా? అంటూ చాలెంజ్ విసరడం ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు నారా లోకేశ్ (Nara Lokesh) చేపట్టిన యువగళం యాత్ర (YuvaGalam Padayatra) జోష్ గా కొనసాగుతోంది. రాయలసీమ (Rayalaseema) ప్రాంతంలో కొనసాగుతున్న యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. ఈ యాత్ర 700 కిలో మీటర్ల మైలురాయికి చేరుకుంది. అయితే యాత్రలో తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన పనుల వద్ద సెల్ఫీలు (Selfie) దిగి సీఎం వైఎస్ జగన్ (YS Jagan)కు లోకేశ్ సవాల్ (Challenge) విసురుతున్నారు. తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో (Anantapuram District) కియా పరిశ్రమ వద్ద సెల్ఫీ దిగి జగన్ కు సవాల్ విసిరారు.
శ్రీ సత్యసాయి జిల్లా (Sri Sathya Sai District) పెనుకొండ నియోజకవర్గంలో (Penukonda) ప్రస్తుతం యువగళం యాత్ర లోకేశ్ కొనసాగిస్తున్నారు. పెనుకొండ నియోజకవర్గంలోని హరిపురంలో గురువారం యాత్రను లోకేశ్ ప్రారంభించారు. అనంతరం స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. యాత్ర కొనసాగించిన అనంతరం మునిమడుగు గ్రామం వద్ద ఉన్న కియా ఫ్యాక్టరీని (KIA Factory) చూశారు. జాతీయ రహదారిపైన ఉండే ఫ్యాక్టరీ బోర్డు కనిపించేలా లోకేశ్ సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం కియా ఉద్యోగులతో మాట్లాడారు. పాదయాత్ర గుట్టూరు గ్రామంలో 700 కిలో మీటర్లకు చేరడంతో లోకేశ్ శిలాఫలకం ఏర్పాటుచేశారు.
‘కియా పరిశ్రమ ఇది. ఏపీలోనే అతిపెద్ద సింగిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ (Largest Single Manufacturing Plant). భారతదేశంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (FDI) పెట్టిన సంస్థ ఇది. పెట్టుబడి రూ.13 వేల కోట్లు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 వేల మందికి ఉద్యోగాలు (Jobs). ఏడాదికి 4 లక్షల వాహనాలు (Vehicles) ఉత్పత్తి’ అని లోకేశ్ ట్వీట్ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ కు ఇలాంటి కంపెనీని తీసుకురావాలని మీరు కలలో కూడా ఊహించలేరు వైఎస్ జగన్’ అని లోకేశ్ ట్విటర్ (Twitter)లో తెలిపారు.
తన పాదయాత్రలో టీడీపీ హయాంలో తీసుకొచ్చిన కంపెనీలు, చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తున్నారు. కంపెనీలు, పరిశ్రమల వద్ద సెల్ఫీలు తీసుకుని సీఎం జగన్ కు సవాల్ విసురుతున్నారు. ఇలాంటి కంపెనీలు మీరు తీసుకురాగలరా? అంటూ చాలెంజ్ విసరడం ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పెనుకొండ, మడకశిర నియోజకవర్గ తాగు, సాగునీటి సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని లోకేశ్ పేర్కొన్నారు. వచ్చేది తెలుగుదేశం పార్టీనేనని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.
This is Kia. Largest Single Manufacturing Plant in Andhra Pradesh. Largest foreign direct investment in India. Investment: 13000 Cr Jobs: 40,000 (Direct & Indirect) Installed capacity: 4 lakh vehicles per annum (1/2) pic.twitter.com/ngt905Kxus