»Unstoppable Protest Amaravati Farmers Movement Reached To 1200 Days
Amaravati Movement ఉక్కు సంకల్పం.. అమరావతి ఉద్యమం @1200 రోజులు
జగన్ ప్రభుత్వం మొండి అమరావతిని అణచివేసేందుకు చూస్తోంది. ఇలా అరాచక ప్రభుత్వంతో రైతులు రోజులు.. నెలలు.. సంవత్సరాలుగా పోరాడుతూ ఉద్యమాన్ని వీడలేదు. వారి సంకల్పం ముందు ఏదీ పని చేయడం లేదు.
అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ (YS Jagan) 17 డిసెంబర్ 2019న అసెంబ్లీ మూడు రాజధానుల (Three Capitals) ప్రస్తావన తీసుకొచ్చారు. అమరావతితో (Amaravati) పాటు విశాఖ (Visakhapatnam), కర్నూలులో (Kurnool) రాజధానులు ఉంటాయని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ఏపీలో అలజడి మొదలైంది. అమరావతిని కాదని విశాఖను రాజధానిగా కొనసాగించాలని వైఎస్సార్ సీపీ (YSRCP) ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటనపై ఉమ్మడి కృష్ణా (Krishna), గుంటూరు జిల్లాలో (Guntur) తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. వెంటనే రాజధాని గ్రామాల ప్రజలు ఉద్యమబాట పట్టారు. 2020 జనవరిలో విజయవాడ కనకదుర్గమ్మకు (Kanakadurga Temple) పొంగళ్లు సమర్పించి అలుపెరుగని పోరాటం ప్రారంభించారు. అయితే ఈ ఉద్యమాన్ని (Amaravati Farmers Movement) సీఎం జగన్ ఉక్కుపాదంతో అణచివేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. రైతులపై కరుణ లేకుండా లాఠీచార్జ్, దాడులు, దొంగ కేసులు పెట్టి వేధింపులకు ప్రభుత్వం పాల్పడింది. 144 సెక్షన్, సెక్షన్ 30 వంటివి ప్రయోగించి రాజధాని గ్రామాలను అష్టదిగ్బంధం చేసి ఒక భయానక వాతావరణం సృష్టించారు. అయినా రైతులు బెదరలేదు. తమ ప్రాంతం కోసం ఉద్యమం కొనసాగించారు.
ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు – 20 జనవరి 2020న చలో అసెంబ్లీని రైతులు (Farmers) విజయవంతంగా చేపట్టారు. అసెంబ్లీకి చేరుకున్న రైతులపై పోలీసులు విచక్షణా రహితంగా దాడి చేశారు. లాఠీచార్జ్ (Lottycharge)తో రైతులపై తీవ్రంగా దాడి చేశారు. పలువురు గాయాలపాలయ్యారు. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన రైతులపై వందల కేసులు ఫైల్ చేశారు.
– 8 మార్చి 2021 మహిళా దినోత్సవం రోజు విజయవాడ కనకదుర్గ ఆలయానికి వెళ్తున్న మహిళా రైతులపై పోలీసులు దాడి. రాజధాని ఉద్యమంలో పాల్గొంటున్న మహిళలపై కేసులు నమోదు చేశారు.
– 1 నవంబర్ 2021న రైతులు ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు’ (Nyayasthanam to Devasthanam Padayatra) పేరుతో తుళ్లూరు నుంచి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. ఈ యాత్రకు ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభించింది. అయితే ఈ పాదయాత్రను ప్రభుత్వం అణచివేసేందుకు తీవ్ర ప్రయత్నం చేసింది. రైతులకు మద్దతు పలికేవారిపై వేధింపులకు పాల్పడింది. ఎక్కడికక్కడ పోలీసులతో అభ్యంతరాలు సృష్టిస్తూ ఆటంకం ఏర్పరచింది. అయినా కూడా మొక్కవోని దీక్షతో రైతులు ఈ యాత్రను పూర్తి చేశారు.
– 12 సెప్టెంబర్ 2022 అమరావతి పరిరక్షణ ఉద్యమం చేపట్టారు. అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లాలోని (SriKakulam District) అరసవల్లి సూర్య దేవాలయం (Arasavalli Temple) వరకు పాదయాత్ర ప్రారంభించారు. ప్రభుత్వం వేధింపులు తీవ్రం చేయడంతో రామచంద్రాపురం వరకు చేరుకున్న పాదయాత్రను రైతులు అర్ధాంతరంగా ఆపివేశారు.
ఇలా నిరాటంకంగా రైతులు, మహిళలు కుటుంబాలతో కలిసి ఉద్యమం చేస్తున్నారు. వీరికి కాంగ్రెస్ (Congress Party), తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party), జనసేన (JanaSena), కమ్యూనిస్టు పార్టీలు సహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. రైతుల వెన్నంటే ఈ పార్టీలు ఉండగా.. ఒక్క వైఎస్సార్ సీపీ మాత్రం ఈ ఉద్యమానికి దూరంగా ఉంది. రైతుల ఉద్యమాన్ని చులకన చేసింది. పలుమార్లు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. కాగా న్యాయస్థానాలు కూడా రైతుల ఉద్యమానికి అండగా నిలిచింది. అయినా కూడా జగన్ ప్రభుత్వం మొండి అమరావతిని అణచివేసేందుకు చూస్తోంది. ఇలా అరాచక ప్రభుత్వంతో రైతులు రోజులు.. నెలలు.. సంవత్సరాలుగా పోరాడుతూ ఉద్యమాన్ని వీడలేదు. వారి సంకల్పం ముందు ఏదీ పని చేయడం లేదు. కాగా వచ్చే ఎన్నికల్లో అమరావతి అంశం ప్రధాన అస్త్రం కానుంది. రాజధాని ప్రాంత రైతులు వైఎస్సార్ సీపీకి సాగనంపనున్నారు. అలా చేస్తున్న ఉద్యమం నేటికి 1200 రోజులు పూర్తి చేసుకుంది. ఇదే స్ఫూర్తితో అమరావతి రాజధానిగా కొనసాగేంత కాలం ఉద్యమం కొనసాగుతుందని రైతులు చెబుతున్నారు.