»Tdp Chief Chandrababu Naidu Pays Tribute To Taraka Ratna
Taraka Ratnaకు భగవంతుడు సహకరించలే.. MLAగా పోటీ చేస్తానన్నాడు: చంద్రబాబు
పరామర్శ సమయంలో చంద్రబాబు వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో కూడా మాట్లాడుకోవడం ఆసక్తికరం. ఈ సందర్భంగా వారిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. తారకరత్నకు అందించిన వైద్యం, అంత్యక్రియలు తదితర అంశాలపై మాట్లాడుకున్నట్లు తెలుస్తున్నది. విజయసాయిరెడ్డి తారకరత్న బంధువు. అందుకే దగ్గరుండి తారకరత్న కార్యక్రమాలు చూసుకుంటున్నారు.
పార్టీ నాయకుడు, నటుడు, బంధువైన నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) కన్నుమూయడంతో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) దిగ్భ్రాంతికి లోనయ్యారు. నందమూరి కుటుంబం (Nandamuri Family)తో పాటు నారా కుటుంబమంతా విషాదంలో మునిగింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ శివారు మోకిల గ్రామంలోని తారకరత్న నివాసానికి మృతదేహం చేరుకుంది. తారకరత్న పార్థీవదేహనికి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా తారకరత్న భార్య అలేఖ్య, కుమార్తెతో చంద్రబాబు పరామర్శించి ధైర్యం చెప్పారు. మీకు అండగా ఉంటానని ప్రకటించారు.
అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ‘కుటుంబం, అభిమానులు ప్రార్థించినా ఫలితం లేకుండాపోయింది. ఈనెల 22వ తేదీకి తారకరత్నకు 44 ఏళ్లు పూర్తవుతాయి. ఒక మంచి భవిష్యత్ ఉన్న వ్యక్తిని కోల్పోయాం. 23 రోజులు మృతువుతో పోరాడారు. చాలా చిన్న వయసులో మరణించడం చాలా బాధేసింది. ఒకే రోజు 9 సినిమాలు ప్రారంభించడం చరిత్ర. అమరావతి సినిమాతో నంది అవార్డు అందుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి ఉందని నాతో చెప్పారు. మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుందామని చెప్పా. ఈ సమయంలోనే తారకరత్న మరణం చాలా దురదృష్టం బాధాకరం’ అని చంద్రబాబు తెలిపారు.
తారకరత్నను కాపాడుకునేందుకు శత విధాల ప్రయత్నించినా కాపాడలేకపోయినట్లు చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఎన్ని ప్రయత్నాలు చేసినా భగవంతుడు సహకరించకపోతే ఏమీ చేయలేం. నేను ఎక్కడికి వెళ్లినా నన్ను తెలుగుదేశం పార్టీ శ్రేణులు తారకరత్న ఆరోగ్యం గురించే ఆరా తీశారు. కుటుంబసభ్యులంతా ఆవేదనలో ఉన్నారు. చిన్న వయసులో ఏ ఆశయాల కోసం పని చేశారో వాటిని ముందుకు తీసుకెళ్లాలా అభిమానులు కృషి చేయాలని కోరుకుంటున్నా. తారకరత్న పిల్లలను చూస్తే చాలా బాధగా ఉంది. భగవంతుడు ఆ కుటుంబానికి అన్ని విధాల సహకరించాలని, మేం కూడా ఉంటాం’ అని చంద్రబాబు ప్రకటించారు. కాగా యువగళం పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించిన టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) తన సతీమణి బ్రహ్మణితో కలిసి వచ్చారు. తారకరత్న పార్థీవదేహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఇక నందమూరి కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు తారకరత్నకు నివాళులర్పిస్తున్నారు.
పరామర్శ సమయంలో చంద్రబాబు వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో కూడా మాట్లాడుకోవడం ఆసక్తికరం. ఈ సందర్భంగా వారిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. తారకరత్నకు అందించిన వైద్యం, అంత్యక్రియలు తదితర అంశాలపై మాట్లాడుకున్నట్లు తెలుస్తున్నది. విజయసాయిరెడ్డి తారకరత్న బంధువు. అందుకే దగ్గరుండి తారకరత్న కార్యక్రమాలు చూసుకుంటున్నారు. వచ్చిన వారికి స్వాగతం పలికి వారిని పలకరిస్తున్నారు.
తారకరత్నకు కుటుంబసభ్యులు, ప్రముఖులతో పాటు అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు నివాళులర్పిస్తున్నారు. హైదరాబాద్ శివారులోని మోకిలలో ఉన్న తారకరత్న నివాసాలను ప్రజలు భారీగా తరలివస్తున్నారు. తారకరత్న మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తున్నారు. రేపు తారకరత్న అంత్యక్రియలు మహాప్రస్థానం శ్మశాన వాటికలో జరగనున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, తారకరత్న బంధువు విజయ సాయిరెడ్డి తారకరత్నకు నివాళులర్పించాడు.