Andhra Pradeshలో ఇదేం ఆచారం రా నాయనా? ఎద్దుతో యువకుడికి పెళ్లి
ఎద్దుతో పాటు ఆ యువకుడికి పసుపు పెట్టారు. మంగళ స్నానాలు చేయించారు. ఇక పెళ్లికి భజనలు చేశారు. బాజాభజంత్రీలు వాయించారు. అనంతరం గ్రామ ప్రజలందరికీ భోజనాలు వడ్డించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భారతదేశం భిన్న ఆచార (Tradition) వ్యవహారాలు ఉన్నాయి. అదే మన దేశ గొప్పదనం. కులాలు, మతాలు కోకొల్లలు ఉన్నా ప్రజలు ప్రశాంతంగా సోదరుల్లాగా జీవించడమే ప్రపంచంలో మన దేశాన్ని ప్రత్యేక గుర్తింపు దక్కుతోంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం ఉంటుంది. వాటిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఒక వింత ఆచారం.. నమ్మకం ఉంది. ఓ యువకుడు ఎద్దు (Bull)ను పెళ్లి చేసుకున్నాడు. ఎందుకంటే ఆ కుటుంబసభ్యులు ఇది తమకు తరతరాలుగా వస్తున్న ఆచారం అని చెబుతున్నారు. ఆ ఆచారం ఏమిటి? ఎందుకు ఆచారం ఉందో తెలుసుకోండి.
ఏపీలోని అనకాపల్లి జిల్లా (Anakapalle District) మాడుగుల (Madugula) మండలం జాలంపల్లిలో రామనాయుడు పాడి వ్యాపారం చేస్తున్నాడు. అయితే తనతో ఉన్న కోడె ఎద్దు మృతి చెందింది. ఈ ఎత్తు సంక్రాంతి సంబరాల్లో ఊరేగిస్తారు. ఈ ఎద్దు మృతితో రామనాయుడు కుటుంబం ఆవేదనకు గురైంది. అయితే మూడేళ్ల కిందట భోగి రోజు రామనాయుడు ఇంట ఓ దూడ జన్మించింది. ఆ దూడను సింహచలం అప్పన్నగా భావించారు. దానికి మూడేళ్ల వయసొచ్చాక ఓ యువకుడితో పెళ్లి చేయాలనే ఆచారం ఉంది. ఈ ఆచారంలో భాగంగా ఓ యువకుడికి ఇచ్చి దూతో వివాహం జరిపించారు. ఈ పెళ్లి సాదాసీదాగా చేయలేదు. అచ్చం మనుషుల పెళ్లి మాదిరి ఈ తంతు జరిపించారు.
ఇంటి ముందు అరటి ఆకులతో పందిరి వేశారు. అనంతరం ఎద్దుతో పాటు ఆ యువకుడికి పసుపు పెట్టారు. మంగళ స్నానాలు చేయించారు. ఇక పెళ్లికి భజనలు చేశారు. బాజాభజంత్రీలు వాయించారు. అనంతరం గ్రామ ప్రజలందరికీ భోజనాలు వడ్డించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో గిరిజన ప్రజలు ఎక్కువగా ఉంటారు. వారి ఆచార వ్యవహారాలన్నీ కొండ జాతికి సంబంధించినవై ఉంటాయి. ఆదివాసీల జీవన విధానమే ప్రత్యేకంగా ఉంటుంది. ఇక పెళ్లి కూడా అంతే. గతంలో గాడిదతో, కుక్కతో వివాహాలు జరగడం చాలా చూశాం. కానీ ఎద్దుతో పెళ్లి జరగడం బాహుళా ఇదే తొలిసారి కావొచ్చు.