తారకరత్నకు కుటుంబసభ్యులు, ప్రముఖులతో పాటు అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు నివాళులర్పిస్తున్నారు. హైదరాబాద్ శివారులోని మోకిలలో ఉన్న తారకరత్న నివాసాలను ప్రజలు భారీగా తరలివస్తున్నారు. తారకరత్న మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తున్నారు.
మృత్యువుతో పోరాడి ఓడాడు నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna). గుండెపోటుకు గురై 23 రోజులుగా కొన ప్రాణంతో కొట్టుమిట్టాడిన తారకరత్న శనివారం కన్నుమూశాడు. అతడి మరణంతో తెలుగు సినీ పరిశ్రమతో పాటు రాజకీయ ప్రముఖులు విషాదంలో మునిగారు. అతడి మృతికి రాజకీయ, సినీ రంగ ప్రముఖులు సంతాపం (Condolence) ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR), ఏపీ గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రేవంత్ రెడ్డి, బండి సంజయ్, సినీ నటులు చిరంజీవి (Chiranjeevi), మహేశ్ బాబు (Maheshbabu), పవన్ కల్యాణ్ (Pawan Kalyan), దగ్గుబాటి వెంకటేశ్, నిఖిల్ సిద్ధార్థ్, నాగశౌర్య, మురళీ మోహన్, ఆర్యన్ రాజేశ్, అలీ, తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తారకరత్నకు కుటుంబసభ్యులు, ప్రముఖులతో పాటు అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు నివాళులర్పిస్తున్నారు. హైదరాబాద్ శివారులోని మోకిలలో ఉన్న తారకరత్న నివాసాలను ప్రజలు భారీగా తరలివస్తున్నారు. తారకరత్న మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తున్నారు. రేపు తారకరత్న అంత్యక్రియలు మహాప్రస్థానం శ్మశాన వాటికలో జరగనున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, తారకరత్న బంధువు విజయ సాయిరెడ్డి తారకరత్నకు నివాళులర్పించాడు.
‘నందమూరి తారకరత్న మృతి ఎంతో బాధించింది. సినిమాలు, వినోద రంగంలో తారకరత్న తనదైన ముద్ర వేశారు. అతడి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఓం శాంతి’ – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
‘తారకరత్న మృతితో దిగ్భ్రాంతికి గురయ్యా. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలి’ – తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
ప్రముఖ సినీ నటుడు శ్రీ నందమూరి తారకరత్న మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.#NandamuriTarakaRatna
‘నందమూరి తారకరత్న మృతి వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యా. అత్యంత ప్రతిభావంతుడైన, ఆప్యాయత గల వ్యక్తి చాలా త్వరగా వెళ్లిపోయాడు. అతడి కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలి.’ – చిరంజీవి, సినీ నటుడు
‘తారకరత్న కన్నుమూయడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నా. మూడు వారాలుగా చికిత్స పొందుతున్న తారకరత్న కోలుకుంటాడని భావించా. ఆయన నటుడిగా రాణిస్తూనే ప్రజా జీవితంలో ఉండాలనుకొన్నాడు. ఆ ఆశలు నెరవేరకుండానే తుదిశ్వాస విడవటం దురదృష్టకరం. తారకరత్న భార్యాబిడ్డలకు, తండ్రి మోహనకృష్ణకు, బాబాయి బాలకృష్ణకు, ఇతర కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ – పవన్ కల్యాణ్, సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత
‘తారకరత్న మరణవార్త విని షాకయ్యా. ఇంత చిన్న వయసులోనే ఆయన మనల్ని వీడి వెళ్లడం నిజంగా బాధాకరం. తారకరత్న కుటుంబానికి భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా’ – మహేశ్ బాబు, సినీ నటుడు
‘మృత్యువుతో పోరాడి తారకరత్న మరణించాడనే విషాద వార్త తెలిసి చాలా బాధపడ్డా. ఇతరుల పట్ల దయార్ధ వ్యక్తిత్వం కలిగిన తారకరత్న ఎప్పటికీ గుర్తుండిపోతాడు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి.’ – రవితేజ, సినీ నటుడు
Pained by the untimely demise of Shri Nandamuri Taraka Ratna Garu. He made a mark for himself in the world of films and entertainment. My thoughts are with his family and admirers in this sad hour. Om Shanti: PM @narendramodi