సింహం (lion)పేరు వింటేనే జనం భయపడతారు. అదే సింహం వేటకు వెళ్లినప్పుడు అత్యంత ప్రమాదకరం. సింహం తన ఎరను ఒకే స్ట్రోక్‌లో బంధిస్తుందని మనం తరచుగా వింటూ ఉంటాము. అత్యంత శక్తివంతమైన జంతువును కూడా సింహం ముందు నిస్సహాయంగా మారుతుంది. అయితే, ఇందుకు భిన్నంగా సోషల్ మీడియాలో చాలా ఆశ్చర్యకరమైన వీడియో వచ్చింది. అడవికి రారాజు అనదగ్గ అలాంటి సింహం కూడా అడవి (forest) విడిచి ఊళ్లోకి వచ్చి ఓ ఎద్దుకు లోకువైపోయింది. గుజరాత్ (Gujarat) లోని జునాగఢ్ లో ఘటన జరిగింది. నాలుగైదు సింహాలు (lions) వచ్చినా ఆ ఎద్దు మహా పౌరుషంతో వెంట తరిమింది. ఇది సింహాలకు నెలవు. అక్కడ్నించి సింహలు తరచుగా సమీపంలోని గ్రామాల్లోకి ప్రవేశిస్తుంటాయి. ఆ విధంగానే ఓ సింహాల గుంపు జునాగఢ్(Junagadh) లోకి ప్రవేశించింది. ఎంతో ఠీవిగా నడుచుకుంటూ వస్తున్న ఆ సింహాలు ఉన్నట్టుండి వెనుదిరిగి పరుగు లంకించుకున్నాయి. ఏంటని చూస్తే… విపరీతమైన ఆవేశంతో దూసుకువచ్చిన ఓ ఎద్దు(bull) ఆ సింహాలను దౌడు తీయించింది. ఎద్దు దెబ్బకు ఆ సింహాలు చెల్లాచెదురయ్యాయి. ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. అంతేకాదు, ఆరుబయట నిద్రిస్తున్న ఓ వ్యక్తి కూడా ఈ వ్యవహారాన్ని తన సెల్ ఫోన్ లో బంధించాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్(viral) అవుతోంది.ఇది మీరు కూడా చూస్తే ఆశ్చర్యపోతారు. అందుకే ఈ వీడియో వైరల్‌గా మారింది.
చదవండి : ఏనాడూ పదవులు కోసం ఆరాటపడలేదు : ఈటల
https://twitter.com/HasnaZarooriHai/status/1658868193971277825

