»Gujarat Surat Parliament Bjp Mp Mukesh Dalal Is Unanimous
unanimous: గుజరాత్ బీజేపీ ఎంపీ ముఖేష్ దలాల్ ఏకగ్రీవం
దేశంలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళ బీజేపీ ఒక ఎంపీ స్థానాన్ని సాధించింది. గుజరాత్‌లోని సూరత్ పార్లమెంటరీ స్థానం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఏకగ్రీవం అయ్యారు.
Gujarat Surat Parliament BJP MP Mukesh Dalal is unanimous
unanimous: దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల హడావిడీ ఉన్న వేళ బీజేపీ బోణీ కొట్టింది. గుజరాత్‌లోని సూరత్ లోక్ సభ స్థానం బీజేపీ ఏకగ్రీవమైంది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రంలో ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడంతో అక్కడ వారి పట్టు ఎలాంటిదో అర్థం అవుతుంది. అయితే సూరత్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ముఖేశ్ దలాల్‌కు పోటీగా ఎవరు లేకపోవడంతో తాజాగా రిటర్నింగ్ అధికారి ఈ ప్రకటన చేశారు. అక్కడ ఇద్దరి కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. మరో ఎనిమిది మంది ఇతర పార్టీ అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. దీంతో ముఖేష్ దలాల్ ఏకగ్రీవం అయ్యారు.
దేశంలో మొత్తం 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండగా మొదటి దశ ఏప్రిల్ 19 న కొన్ని రాష్ట్రాలలో ముగిసింది. తరువాత మూడో దశలో మే7 నుంచి గుజరాత్లో పోలింగ్ జరగనుంది. సూరత్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ముఖేశ్ దలాల్, కాంగ్రెస్ అభ్యర్థిగా నీలేశ్ కుంభానీ బరిలో దిగారు. మరో కాంగ్రెస్ వ్యక్తి సురేశ్ పడ్సాలా కూడా ఉన్నారు. నామినేషన్లు దాఖలు చేశారు. ఇద్దరి కాంగ్రెస్ అభ్యర్థుల పత్రాల్లో డాక్యుమెంట్స్, సంతకాలు తేడాలు ఉండడంతో వాటిని అధికారులు తిరస్కరించారు. ఆ తరువాత మిగితా ఎనిమిది మంది పోటీ దారులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇక ముఖేష్ దలాల్‌కు పోటీ ఎవరు లేకపోవడంతో రిటర్నింగ్ అధికారి సౌరభ్ పార్థీ ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారిక ప్రకటన చేశారు.