SRD: హత్నూర మండలంలోని పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను ఎస్పీ పరితోష్ పంకజ్ గురువారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును పరిశీలించి పోలింగ్ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. పోలింగ్ పూర్తయిన తర్వాత కౌంటింగ్ కూడా ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.