కాకినాడ: గండేపల్లి మండలం మురారి వద్ద జాతీయ రహదారిపై బుధవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహంపై ఎటువంటి గాయాలు లేవని, ఇది సహజ మరణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుని వివరాలు తెలిస్తే 9440904841, 9440796529 నంబర్లలో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. మృత దేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు.