»The Angry Bull In Up Is A Farmer Akhilesh Yadav Tweet
Viral Video: పగబట్టిన ఎద్దు చెట్టేక్కిన రైతు
ఓ ఎద్దు రైతును పగబట్టినట్లుగా అనిపిస్తోంది. ఎందుకంటే అతను ఎటు వెళ్తే అటే వెళ్లడం. అతన్ని వెంబడించడం జరిగింది. ఆ క్రమంలో రైతు తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఏకంగా ఓ చెట్టు ఎక్కాడు. అయినా కూడా ఆ ఎద్దు అక్కడే రెండు గంటల పాటు ఉండటం విశేషం. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Viral News: మాములుగా పాములు పగ బడుతాయి అని వింటుంటాము. కానీ ఆవులు, ఎద్దులు కూడా పగబట్టడం చూశామా… అయితే అలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని బలియా జిల్లాలో ఒక ఎద్దు(bull )కు భయపడి ఓ రైతు చెట్టు(Tree) ఎక్కి కూర్చున్నాడు. దాదాపు రెండు గంటలకు పైగా అతడు ప్రాణాలకు భయపడి చెట్టుపైనే కూర్చున్నాడు. ఈ ఘటనను ఓ రైతు చిత్రీకరించాడు. దీనిపై యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) సైతం స్పందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్టా మారింది.
ఉత్తరప్రదేశ్ రస్డా పోలీస్‌స్టేషను పరిధిలో ఓ ఎద్దు దారితప్పి గత కొన్ని రోజులుగా స్థానికంగా 12 మందిని గాయపరిచింది. అదే మాదిరిగా శుక్రవారం ఖఖ్ను అనే రైతు వెంటపడింది. భయంతో పరుగెత్తిన రైతు చెట్టు ఎక్కాడు. అతని వెనుకాలే పరుగెత్తిన ఎద్దు చెట్టు దగ్గర నుంచి కదల్లేదు. పగబట్టినదానిలా వ్యవహరించింది. రైతు కదిలితే బెదిరిస్తూ రెండు గంటలు అతనికి చెమటలు పట్టించింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ ఘటనపై అఖిలేశ్(Akhilesh Yadav) స్పందిస్తూ ఇలాంటి ఎడ్లను అరికట్టేందుకు బుల్ ప్రొటెక్షన్ పోలీసులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతంలో ఇలా దారి తప్పిన ఎద్దులను ఇప్పటివరకు దాదాపు 3,910 వరకు సంరక్షణ కేంద్రాల తరలించామని అధికారులు చెప్పారు. కాగా, వైరల్ వీడియోలోని ఎద్దును పట్టుకునేందుకు ఓ బృందం కార్య రంగంలోకి దిగడం విశేషం.