»Next Years Formula E Race In Hyderabad Is In Doubt
Hyderabad:లో వచ్చే ఏడాది ఫార్ములా-ఈ రేసు డౌటే?
వచ్చే ఏడాది హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా-ఈ రేసు విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. గత ఏడాది హైదరాబాద్‌లో నిర్వహణ సరిగ్గా చేయలేదని అందుకే వచ్చే ఏడాది నిర్వహించనున్న దానిపై క్లారిటీ రాలేదని తెలుస్తోంది. గతంలో నిర్వహించిన సమయంలో జరిగిన లోపాలు సరిచేస్తేనే వచ్చే ఏడాది ఈ రేసు నిర్వహించే సూచనలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి.
Next year's Formula-E race in Hyderabad is in doubt
Formula-E: తెలంగాణ(Telangana) రాష్ట్రం గత ఏడాది ఫార్ములా-ఈ రేసు(Formula-E race)కు నిర్వహించి దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్(Hyderabad) పేరు మారుమోగేలా చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(KTR) ఈ రేసును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేసింది. దానికి తోడు సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా దీనికి సంబంధించిన వార్తలు హైలెట్‌గా నిలవడంతో దేశవ్యాప్తంగా ఈ రేసుకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సంవత్సరం మాదిరిగానే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ రేసులో ఓ ట్విస్ట్ జరిగింది. హైదరాబాద్‌లో జరగాల్సిన ఆ రేసును ఫార్ములా-ఈ సంస్థ వారి క్యాలెండర్లో చేర్చకపోవడాన్ని చూస్తే ఈ సారి రేసు జరగది అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఫార్ములా-ఈ నిర్వాహకులకు హైదరాబాద్ రేసు ప్రమోటర్ గ్రీన్కో(Greenco) సంస్థకు మధ్య నగదు చెల్లింపులు, రేసు నిర్వహణలో ప్రణాళికా లోపం, ముందు రోజు వరకు ట్రాక్ పనులు పూర్తి కాకపోవడం, సర్క్యూట్ లోపల టీమ్‌లు, డ్రైవర్లకు టాయిలెట్లు లాంటి లోపల పట్ల అల్బెర్టో లాంగో(Alberto Longo) అసంతృప్తి వ్యక్తం చేశాడు. వచ్చే సీజన్లో రేసు జరగాలంటే వీటన్నింటినీ అధిగమించాల్సి వుందన్నాడు. అయితే రేసు నిర్వహణలో మంత్రి కేటీఆర్ కృషిని ఆయన అభినందించాడు. రేసుకు పబ్లిసిటీ మంచిగానే ఉన్నప్పటికి నిర్వాహణ ప్రమాణాలను అందుకోవడంలో విఫలమయ్యారని గ్రీన్‌కోపై విమర్శలు గుప్పించాడు. హైదరాబాద్‌లో రెండో రేసు నిర్వహించేదీ లేనిదీ ఇప్పుడే ప్రకటించలేమని లాంగో స్పష్టం చేశాడు.
వరుసగా నాలుగేళ్ల పాటు హైదరాబాద్ సర్క్యూట్‌ను నిర్వహించేందుకు ఫార్ములా-ఈతో తెలంగాణ ప్రభుత్వం, గ్రీన్కో ఒప్పందం కుదుర్చుకున్నాయి. కాగా 2023-2024 క్యాలెండర్లో రేసులు నిర్వహించే అన్ని వేదికల్లో ఇప్పటికే పనులు మొదలయ్యాయని, ఆగస్టు సమీపిస్తున్నా, హైదరాబాద్‌లో ఇంకా ఏర్పాట్లు ప్రారంభమవకపోవడాన్ని అల్బర్టో ఆక్షేపించాడు. 2023-24 సీజన్ జనవరి 13వ తేదీన మెక్సికోలో ప్రారంభమవనుంది. ఆ తర్వాత సౌదీ అరేబియాలో జరగనుంది. అలాగే షెడ్యూల్ ప్రకారం మూడో రేసు హైదరాబాద్‌లో ఫిబ్రవరి 10న నిర్వహించాల్సి ఉంది. గత నెలలో జరిగిన ఫార్ములా బోర్డు సమావేశంలో హైదరాబాద్‌లో నిర్వహించాల్సిన రేసు తేదీలు, వేదిక తప్ప, మిగిలిన అన్ని రేసుల వేదికల్ని ఫిక్స్ చేశారు. అక్టోబరులో జరుగనున్న ఫార్ములా-ఈ తదుపరి సమావేశంలో హైదరాబాద్ రేసు నిర్వహణపై అధికారికంగా తుది నిర్ణయం ప్రకటించనున్నారు.