స్పీడుగా వెళుతున్న కారు ఆకస్మాత్తుగా ఓ ట్రక్కును ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే నలుగురు వ్యక్తులు మృత్యువాత చెందారు. ఈ విషాదఘటన తమిళనాడులోని మధురై జిల్లాలో చోటుచేసుకుంది.
వేగంగా వెళ్తున్న కారు(car) ప్రమాదవశాత్తు వెళ్లి కంటైనర్ ట్రక్కును ఢీకొట్టింది. సోమవారం జరిగిన ఈ విషాద ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు. తమిళనాడు(tamilnadu)లోని మధురై(madurai)లో ఈరోజు తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో ప్రమాదానికి గురైన రెండు వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు కనిపిస్తున్నాయి. ఈ విషాద సంఘటన తెలియగానే స్థానిక అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.