ప్రయాణిస్తున్నజైపూర్-ముంబై ఎక్స్ ప్రెస్ రైళ్లో ఉద్యోగుల మధ్య ఏం గొడవ జరిగిందో తెలియదు. కానీ ఆకస్మాత్తుగా ఓ రైల్వే కానిస్టేబుల్ తన తోటీ ఉద్యోగితోపాటు ముగ్గురు ప్రయాణికులపై కాల్పులు జరిపాడు. దీంతో నలుగురు మృత్యువాత చెందారు.
జైపూర్-ముంబై ఎక్స్‌ప్రెస్ రైలులో కాల్పులు చోటుచేసుకున్నాయి. కోపోద్రిక్తుడైన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) కానిస్టేబుల్ చేతన్ సోమవారం అక్కడ సహోద్యోగిని సహా ముగ్గురు ప్రయాణికులపై కాల్పులు జరిపాడు. GRP కంట్రోల్ ప్రకారం ఈ ఘటన విరార్, మీరా రోడ్ స్టేషన్ల మధ్య ఉదయం 5.30 గంటలకు జరిగింది. డ్యూటీలో ఉన్న ఇద్దరు RPF కానిస్టేబుళ్ల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆ క్రమంలో అందులో ఉన్న ఓ వ్యక్తి తన తుపాకీని తీసుకొని మరొకరిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో మరో కానిస్టేబుల్‌తోపాటు ఓ మహిళ సహా ముగ్గురు ప్రయాణికులు మరణించారు. ఈ ఘటనపై పోలీసులు, ఆర్పీఎఫ్ అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే కాల్పులు జరిపిన తర్వాత చేతన్ ట్రైన్ నుంచి కిందకు దూకేశాడు. కానీ మిగతా సిబ్బంది అతన్ని వెంబడించి పట్టుకుని అతని దగ్గర ఉన్న ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.