The Indian women's hockey team had a great victory over the Spanish team
Hockey: స్పెయిన్(Spain) హాకీ(hockey) సమాఖ్య శత వసంత ఉత్సవాల(Federation Centenary Spring Festival) సందర్భంగా నిర్వహించిన అంతర్జాతీయ టోర్నీ(International tournament)లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 3-0తో స్పెయిన్ జట్టును చిత్తు చేసి టోర్నీలో విజేతలుగా నిలిచారు. ఎంతో కీలకంగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో 22వ నిమిషంలో వందన కటారియా(Greetings Kataria) గోల్ చేసి ఆటకు శుభారంభం మొదలు పెట్టింది. ఉత్కంఠతతో కొనసాగుతున్న గేమ్‌లో అతిథ్య జట్టుకు చుక్కలు చూపిస్తూ మోనిక(Monika) 48వ నిమిషంలో రెండవ గోల్‌ను భారత ఖాతాలో చేర్చింది. తరువాత 58వ నిమిషానికి ఉదిత(Udita) భారత్ తరపున మరో గోల్‌తో విజయం ఢంకా మోగించింది.
3 దేశాల ఈ టోర్నీలో 4 మ్యాచ్‌ల ద్వారా 8 పాయింట్లు దక్కించుకున్న భారత్ టేబుల్ టాపర్‌గా ట్రోఫీ(trophy)ని అందుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిని తొలి మ్యాచ్‌ను డ్రా చేసిన భారత్..రెండో పోరులో 2-2తో స్పెయిన్‌ను నిలువరించింది. ఇక మూడో మ్యాచ్‌లో 3-0తో ఇంగ్లండ్‌పై నెగ్గింది. దాంతో టోర్నీ మొత్తం భారత జట్టు అజేయంగా నిలవడం విశేషం. ఇంగ్లండ్‌పై గెలుపుతో ఆత్మవిశ్వాసం నిండిన భారత్..స్పెయిన్‌తో జరిగిన ఆఖరి లీగ్ పోరులో చెలరేగి విజయం సాధించింది.