»Bomb Blast In Pakistan 39 Dead And 150 Injured At Bajaur
Bomb blast: 35 మంది మృతి..150 మందికి గాయాలు
పాకిస్తాన్( Pakistan)- ఆప్గాన్ సరిహద్దులోని బాజూర్ జిల్లాలో మత గురువు, రాజకీయ నాయకుడి మద్దతుదారుల ర్యాలీలో ఆదివారం బాంబు బ్లాస్ట్(Bomb blast) జరిగింది. ఈ ఘటనలో 35 మంది మృతి చెందగా, మరో 150 మందికి పైగా గాయపడ్డారు.
పాకిస్తాన్లో(Pakistan) అధికార సంకీర్ణ సభ్యుడిగా ఉన్న జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం పార్టీ రాజకీయ పార్టీ ర్యాలీలో శక్తివంతమైన బాంబు పేలుడు(Bomb blast) సంభవించింది. ఈ ఘటనలో 35 మంది మరణించగా, 150 మందికి పైగా గాయపడ్డారు. ఆఫ్ఘాన్ సరిహద్దుకు సమీపంలోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బజూర్(bajaur) జిల్లా రాజధాని ఖర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన స్థానికులు వారిని ఖార్లోని ప్రధాన ఆసుపత్రికి తరలించారు. వారిలో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. తాలిబాన్ అనుకూల మతపెద్దగా పేరుగాంచిన సీనియర్ పార్టీ నాయకుడు ఫజార్-ఉర్-రెహ్మాన్ రాకముందే ఈ పేలుడు సంభవించింది. ఇస్లామాబాద్‌లోని సంకీర్ణ ప్రభుత్వంలో అతని రాజకీయ పార్టీ ప్రబావం కూడా ఉంది.
ప్రస్తుతం పాకిస్తాన్ అంతటా అక్టోబర్ నాటికి జరగనున్న రాబోయే ఎన్నికల(elections) కోసం హడావిడి చేస్తున్నారు. ఆ నేపథ్యంలో పార్టీ భాగస్వామ్యానికి మద్దతు సేకరించే ప్రయత్నంలో భాగంగా బజూర్ జిల్లాలో ర్యాలీ జరిగింది. మృతుల్లో రెహ్మాన్ పార్టీకి చెందిన స్థానిక చీఫ్ మౌలానా జియావుల్లా కూడా ఉన్నారు. సెనేటర్ అబ్దుర్ రషీద్, మాజీ శాసనసభ్యుడు మౌలానా జమాలుద్దీన్ కూడా వేదికపై ఉన్నారు. కానీ వారు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రెహ్మాన్ ర్యాలీలో లేరని పార్టీ అధికారులు తెలిపారు. రెహ్మాన్ తాలిబాన్ అనుకూల మతాధికారిగా పరిగణించబడ్డాడు. అతని రాజకీయ పార్టీ ఇస్లామాబాద్‌లోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఉంది. రెహ్మాన్ ఉన్నారో లేదో తెలియదు. వచ్చే ఎన్నికల కోసం మద్దతుదారులను సమీకరించేందుకు దేశవ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బజూర్ ఒకప్పుడు గిరిజన ప్రాంతంగా ఉండేది. కానీ ఇప్పుడు జిల్లాగా ఉంది. ఇటీవలి సంవత్సరాల వరకు పాకిస్తానీ మిలిటరీ గిరిజన ప్రాంతం నుంచి తీవ్రవాదాన్ని నిర్మూలించడానికి భారీ కార్యకలాపాలు నిర్వహించే వరకు ఇస్లామిక్ ఉగ్రవాదులకు సురక్షితమైన స్వర్గధామంగా ఉంది. మిలిటెంట్లు ఇప్పటికీ భద్రతా బలగాలు, పౌరులపై తరచుగా దాడులు చేస్తున్నారు.