»Stock Market In Heavy Losses 710 Points Bank Nifty Loss 17th Feb 2023
Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..710 పాయింట్లు అవుట్
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం పెద్ద ఎత్తున నష్టాలతో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న ప్రతికూల ధోరణుల దృష్యా దేశీయ మార్కెట్లు కూడా దిగువకు పయనిస్తున్నాయి. దీంతో ఒక దశలో బీఎస్ఈ(BSE) సెన్సెక్స్ 400, ఎన్ఎస్ఈ(NSE) నిప్టీ 120కిపైగా, బ్యాంక్ నిఫ్టీ 710 పాయింట్లు కోల్పోయాయి.
indian stock market losses december 21st 2023 sensex loss 440 points
దేశీయ స్టాక్ మార్కెట్లు వారంతంలో(friday) భారీ నష్టాల(heavy losses)తో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న ప్రతికూల ధోరణుల దృష్యా దేశీయ మార్కెట్లు కూడా కిందకు పయనీస్తున్నాయి. ఈ క్రమంలో ఒక దశలో బీఎస్ఈ(BSE) సెన్సెక్స్ 400 పాయింట్లు కోల్పోగా, ఎన్ఎస్ఈ(NSE) నిప్టీ 120కిపైగా పాయింట్లను నష్టపోయింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ(BANK NIFTY) సూచీ ఒక సమయంలో ఏకంగా 710 పాయింట్లను కోల్పోయింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ 60,800కు దగ్గరగా కొనసాగుతుండగా, నిఫ్టీ 18 వేల దిగువకు చేరింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 40,900కు చేరువైంది.
యూఎస్(USA) మార్కెట్లు గురువారం నష్టాలతో ముగియడం సహా ద్రవ్యోల్బణం(inflation) సహా పలు అంశాలు మార్కెట్లపై ఎక్కువగా ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. దీంతోపాటు ద్వైమాసిక చర్చలో భాగంగా వడ్డీ రేట్ల పెంపు ఉండే అవకాశం ఉందని అమెరికా ప్రతినిధుల నుంచి సమాచారం తెలిసింది. ఈ ప్రభావంతో ఆసియాలోని ఇతర దేశాల సూచీలు సైతం నష్టాల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అదానీ ఎంటర్ ప్రైజెస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, నెస్లే, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్ వంటి కంపెనీలు టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి.