అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు(mahesh babu), త్రివిక్రమ్(trivikram) కలిసి చేస్తున్న సినిమా ఎస్ఎస్ఎంబీ 28. దాంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ చూశాక.. మహేష్ ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తున్నాయి. తాజాగా ఎస్ఎస్ఎంబీ 28 మాస్ స్ట్రైక్‌కు టైం ఫిక్స్ చేశారు.
సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా.. ఈ నెల 31న ఎస్ఎస్ఎంబీ 28(SSMB28) టైటిల్ అండ్ మాస్ స్ట్రైక్ వీడియోని.. అభిమానుల చేతుల మీదుగా థియేటర్లో విడుదల చేయనున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్. తాజాగా మోసగాళ్లకు మోసగాళ్లు సినిమా రీ రిలీజ్ థియేటర్లో.. సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు మాస్ స్ట్రైక్ రిలీజ్ చేసేందుకు టైం ఫిక్స్ చేశారు. దాంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఆ సమయం కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే మాస్ స్ట్రైక్ అంటూ ఊరిస్తూ.. ఈ క్రమంలో మేకర్స్ వదులుతున్న ఎస్ఎస్ఎంబీ 28 పోస్టర్స్ ఓ రేంజ్లో ఉంటున్నాయి.
ముఖ్యంగా.. మాస్ స్ట్రైక్‌కు రెండు రోజులు ఉందని రివీల్ చేసిన ఒక పోస్టర్.. ఘట్టమనేని ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేసేలా ఉంది. ఎందుకంటే.. ఈ పోస్టర్లో మహేష్ బాబు(mahesh babu) కబడ్డీ ఆటలో కూతకు వెళ్తున్న వేటగాడిలా ఉన్నాడు. ఒక్కడు సినిమాలో మహేష్ బాబు ఆడిన కబడ్డీ ఆటకు బాక్సాఫీస్ బద్దలైంది. ఇప్పుడీ పోస్టర్ కూడా ఒక్కడులా సునామి సృష్టించేందుకు రెడీ అవుతున్నట్టుగా ఉంది.
అయితే ఎస్ఎస్ఎంబీ 28లో కబడ్డీ ఉందో లేదో తెలియదు గానీ.. మహేష్ బాబు రౌడీలతో ఆడే కబడ్డీ ఫైట్ మాత్రం మామూలుగా ఉండదని అంటున్నారు. ఎందుకంటే.. త్రివిక్రమ్ ఈ సినిమాను పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కబడ్డీ ఆడుతుందని అంటున్నారు మహేష్ ఫ్యాన్స్(fans). ఇక పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను.. హారిక, హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా.. జనవరి 13న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.