రేపు(జులై 18న) తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల చేయనున్నట్లు టీటీడీ (TTD) తెలిపింది. భక్తులకు సౌకర్యంగా ఉండేలా షెడ్యూల్ ప్రకారం ఆర్జిత సేవలు(earned services), దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు తితిదే ఓ ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్లైన్ లక్కీడిప్ (Lucky dip) కోసం జులై 18న ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చని తితిదే తెలిపింది. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు సొమ్ము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం(Brahmotsavam), ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను జులై 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అక్టోబర్ నెల అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను జులై 24న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.సెప్టెంబర్ నెల ఆంగప్రదక్షిణం (Angapradakshina) టోకెన్ల కోటాను జూన్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 27 నుంచి 29వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాల సేవా టికెట్ల కోటాను జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు టిటిడి (TTD) ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. భక్తులు https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో వీటిని బుక్ చేసుకోవచ్చు.