»Shock For The Star Cricketers Of Team India Dope Test For Them
Team India Dope Test: టీమిండియా స్టార్ క్రికెటర్లకు షాక్..వారికి డోప్ టెస్ట్!
టీమిండియా క్రికెటర్లకు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(NADA) పలు టెస్ట్‌లు నిర్వహించింది. అందులో అత్యధికంగా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు మూడుసార్లు డోప్ టెస్ట్ నిర్వహించినట్లు తెలిపింది.
భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja)కు మూడుసార్లు డోప్ టెస్ట్ (Dope Test) చేసినట్లు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(NADA) వివరాలు వెల్లడించింది. NADA వెబ్సైట్ ఈమేరకు ఓ జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాది మొదటి 5 నెలల్లో మొత్తం 55 మంది క్రికెటర్లకు డోప్ టెస్ట్‌లు నిర్వహించారు. 2021లో 54 మంది క్రికెటర్ల నమూనాలను, 2022లో 60 మంది క్రికెటర్ల నమూనాలను తీసుకున్నట్లు నాడా వెల్లడించింది.
2023వ సంవత్సరం మొదటి ఐదు నెలల్లో, భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit sharma), స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ(Virat kohli)కి పరీక్షలు చేయలేదని, అయితే టీ20(T20)లకు ఏప్రిల్‌లో హార్దిక్ పాండ్యా దూరంగా ఉండటం వల్ల ఆయన మూత్ర నమూనాలను సేకరించినట్లు నాడా సంస్థ తెలిపింది. 2021, 2022 సంవత్సరాల్లో రోహిత్‌కు ఎక్కువగా పరీక్షలు చేయగా 2021, 2022లో కోహ్లీకి టెస్టులేవీ నిర్వహించలేదని డోపింగ్ ఏజెన్సీ వెల్లడించింది.
2022లో మహిళా క్రికెటర్ల (Womens cricketers) కోసం దాదాపు 20 శాంపిల్స్ తీసుకున్నట్లు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ తెలిపింది. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో ఇద్దరు మహిళా క్రికెటర్లు, భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఒక్కసారి మాత్రమే పరీక్షలకు దూరంగా ఉన్నట్లు నాడా వెల్లడించింది.
ఈ సంవత్సరం జనవరి నుంచి మే నెల వరకు డోప్ పరీక్షలు(Dope Tests) చేపట్టనున్నట్లు నాడా సంస్థ తెలిపింది. అందులో ఇండియా క్రికెటర్లు అయిన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, మయాంక్ అగర్వాల్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, రాహుల్ త్రిపాఠి వంటివారు ఉన్నారు. వీరితో పాటుగా వృద్ధిమాన్ సాహా, దినేష్ కార్తీక్, యశస్వి జైస్వాల్, అంబటి రాయుడు, పీయూష్ చావ్లా, మనీష్ పాండేలు కూడా ఉన్నట్లు డోపింగ్ ఏజెన్సీ వెల్లడించింది.