భారత్ -పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ అంటే ఆ క్రేజ్ వేరు. దాయాదుల (Dayadula) మధ్య జరిగే పోరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ (Cricket) అభిమానులకి అసలుసిసలు మజా అందించే మ్యాచ్ ఏదైనా ఉందంటే.. అది ఇండియా- పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఇరు జట్లు ఎప్పుడో ద్వైపాక్షిక సిరీస్(Bilateral series)లు ఆడడం మానేశాయి. దీంతో ఈ రెండో జట్ల మధ్య మ్యాచ్ చూడాలంటే ఐసీసీ టోర్నీల కోసం ఎదరు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా ఈ సారి మాత్రం ఆసియా కప్, వరల్డ్ కప్ ఉండడంతో భారత్, పాక్ (India and Pakistan) మధ్య కనీసం మూడు నుంచి నాలుగు మ్యాచులు చూసే అవకాశం అభిమానులకి దక్కనుంది.
చదవండి :NTR Coin: ఎన్టీఆర్ పేరుతో రూ. 100నాణెం.. 28న రాష్ట్రపతి చేతుల మీదుగా ఆవిష్కరణ
ఇందులో భాగంగా మొదట ఆసియా కప్ (Asia Cup 2023) లో పాక్తో తలపడనుంది. ఇంత వరకు బాగానే ఉన్నా ఇప్పుడు టీమిండియా జెర్సీపై పాక్ పేరు రాయడం అభిమానులని సందిగ్ధంలో పడేసింది. కప్ 2023 ఆగస్టు 30న ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భాగంగా టీమిండియా (Team India) కొత్త జెర్సీతో అభిమానులని అలరించనుంది. అయితే భారత్ ధరించబోయే ఈ జెర్సీ మీద పాకిస్తాన్ పేరు ఉండడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. నిబంధనల ప్రకారం ఏదైనా మెగా టోర్నీకి ఒక దేశం ఆతిధ్యమిస్తే.. ఆ దేశం పేరు జెర్సీలపై ఉంటుంది. అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. కెప్టెన్ రోహిత్ (Captain Rohit) శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తాజాగా కొత్త జెర్సీ ధరించి అభిమానులని సర్ ప్రైజ్ కి గురి చేశారు. ప్రస్తుతం వీరు ధరించిన పిక్స్ సోషల్ మీడియా(Social media)లో వైరల్ గా మారుతున్నాయి.
చదవండి : America హవాయి ద్వీపంలో కార్చిచ్చు..36మంది మృతి