Rohit Sharma: నాలుగో టెస్టులో రోహిత్ ను ఊరిస్తున్న ఐదు రికార్డులు
భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో ఎన్నో రికార్డులు ఉన్నాయి. అయితే ఇంగ్లాండుతో ఆడబోతున్న నాలుగో టెస్టులో మరిన్ని రికార్డులు కొల్లగొట్టే అవకాశం ఉంది. అవేంటో చూద్దాం.
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన సుధీర్ఘమైన క్రికెట్ కెరీర్లో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసపుకున్నారు. అన్ని ఫార్మాట్లలో రోహిత్ రికార్డులను నమోదు చేశారు. అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్ బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే టెస్టుల్లో కొంచెం తక్కువ రికార్డులు ఉన్నప్పటికీ.. ఆయన ఆట స్పీడ్ ఓ రేంజ్లో ఉంటుంది. రాంచీ వేదికగా ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు ఇంగ్లాండ్ తో నాలుగో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో భారత్ ఇప్పటికే 2-1 లీడ్‌లో ఉంది. ఇక నాలుగో టెస్టు మొదలు కానున్న సందర్భంగా అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
టెస్టు క్రికెట్లో రోహిత్ శర్మ ఇప్పటి వరకు 3,977 పరుగులు చేశాడు. అంటే మరో 23 పరుగులు చేస్తే టెస్టుల్లో 4 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. టెస్టుల్లో కెప్టెన్‌గా 1000 పరుగుల మార్క్‌ను అందుకోవడానికి ఇంకో 70 పరుగులు చేయాల్సి ఉంది. అలాగే ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేయడానికి కేవలం 13 పరుగులు చేస్తే సరిపోతుంది. 7 సిక్సులు కొడితే ఇంటర్నేషనల్ క్రికెట్ లో 600 సిక్సులు కొట్టిన ఘనతను దక్కుతుంది. మరో 37 పరుగులు చేస్తే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 9 వేల పరుగులను పూర్తి చేసిన రికార్డు తన ఖతాలో వేసుకుంటాడు.