The dating app that ruined a football player's life.. went viral
Dating App: సోషల్ మీడియా వాడకం పెరిగాక అన్ని అరచేతుల్లోనే ఉన్నాయి అంటూ మురిసిపోతున్నాము కానీ అదే పెను ప్రమాదంగా మారింది. చాలా యాప్స్ వాడకంలోకి వచ్చాయి. ఏది ఎలా కొంపముంచుతుందో ఎవరికీ తెలియదు. తుర్కియేకు చెందిన ఓ యంగ్ ఫుట్ బాలర్ జీవితాన్ని నాశనం చేసింది ఓ డేటింగ్ యాప్. 21 ఏళ్ల ఎమిర్హన్ డెలిబాస్ అనే ప్లేయర్ ఓ డేటింగ్ యాప్ వాడుతున్నారు. అయితే అందులో తన ఏజ్ 24 ఏళ్లు అని రాశాడు. విషయం తెలుసుకున్న బెసిక్టస్ క్లబ్(Besiktas Club) అతన్ని టెర్మినెట్ చేసింది.
అయితే అతను డేటింగ్ యాప్ వాడినందుకు కాదు అందులో ఏజ్ రాయడంతో అతని అసలు వయసు ఎంత అనేది సమస్యగా మారింది. ఎందుకంటే బెసిక్టస్ క్లబ్(Besiktas Club) తరఫున అండర్ 19 విభాగంలో ఆడుతున్నాడు. రూల్స్ ప్రకారం అతని వయసు ఎక్కువగా ఉందని ఎమిర్హన్ డెలిబాస్(Emirhan Delibas ) తీసేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.