నీళ్లు అనుకొని వేరే ద్రవాన్ని తాగి ఆసుపత్రి పాలైన యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ కొలుకున్నారు. తాజాగా ఫ్లైట్ జర్నీ చేస్తూ.. ఓ ఫన్నీ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.
Can't take risk... Cricketer Mayank Agarwal's funny post goes viral
Mayank Agarwal: భారత యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్(Mayank Agarwa) తన సోషల్ మీడియా వేదికగా ఓ ఫన్నీ పోస్ట్ పెట్టాడు. పూర్తిగా కోలుకున్న ఆయన మరో ఫ్లైట్ జర్నీలో వాటర్ బాటిల్‌ను పట్టుకొని ఓ ఫోటో దిగాడు. దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి రిస్క్ తీసుకోలేను అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది. ఇటీవల ఇండిగో విమానంలో ప్రయాణిస్తూ వాటర్ అనుకొని పొరపడి ఓ ద్రవాన్ని తాగి అసుపత్రిపాలైన సంగతి తెలిసిందే.
రంజీ ట్రోఫీలో భాగంగా కర్ణాటక టీమ్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మయాంక్ అగర్వాల్, త్రిపురలో ఆట ముగించుకొని టీమ్‌తో తిరిగి ఢిల్లీకి వస్తుండగా ఆ ఘటన జరిగింది. మంచినీల్లు అనుకొని హానికరమైన ద్రవాన్ని గొంతులో పోసుకున్నాడు. దాంతో అస్వస్థతకు గురయ్యాడు. పరీక్షించిన వైద్యులు గొంతులో బొబ్బలు వచ్చినట్లు, గొంతు వాపు వచ్చినట్లు డాక్టర్లు గుర్తించారు. ఇటీవల పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు అభిమానులతో ఆయన పంచుకున్నారు. 32 ఏళ్ల మయాంక్ భారత్ తరుఫున 21 టెస్టులు, 5 వన్డే మ్యాచ్‌లు ఆడాడు.