»Asia Cup 2023 Siraj Is A Marvel Avenger Tweet To Anand Mahindra
Asia Cup 2023: సిరాజ్ ఒక మార్వెల్ అవెంజర్.. ఆనంద్ మహీంద్రాకు ట్వీట్
భారత్ ఆసియాకప్ గెలవడంలో హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మాద్ సిరాజ్ పాత్ర ఎంత ముఖ్యమైనదో అందరికి తెలిసిందే. తాజాగా ఆయన గురించి ఆనంద్ మహీంద్రా ఒక ట్వీట్ పెట్టాడు. దానికి ఓ నేటిజన్ సిరాజ్‌కు ఒక ఎస్వీయూ ఇవ్వండి అని రిట్వీట్ చేశాడు. దానికి ఆనంద్ మహీంద్రా బదులిచ్చాడు.
Asia Cup 2023 Siraj is a Marvel Avenger.. Tweet to Anand Mahindra
Asia Cup 2023: ఆసియా కప్ ఫైనల్లో (Asia Cup 2023) శ్రీలంకపై భారత్(India) సులువుగా గెలవడానికి ముఖ్య కారణం ఇండియన్ ఫాస్ట్ బౌలర్ మహ్మాద్ సిరాజ్(Mohammad Siraj) అనడంలో ఎలాంటి సంశయము లేదు. ఆరు వికెట్లతో విరుచుకుపడి ప్రపంచ స్తాయిలో స్టార్‌గా తన పేరు మారుమోగిపోతోంది. అంతేకాకుండా, తనకు వచ్చిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రివార్డును కొలంబో గ్రౌండ్ సిబ్బందికి ఇస్తున్నట్లు ప్రకటించంతో మరింత ప్రాచుర్యం పొందాడు. ఈ క్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) ట్వీట్ చేశారు. దానికి నేటిజన్ ఓ విజ్ఞప్తి చేశాడు.
చాలా ఇంట్రెస్టంగ్ విషయాలను తన ఎక్స్ సోషల్ మీడియా ద్వారా పంచుకునే ఆనంద్, సిరాజ్‌ను పొగుడుతూ ఒక పోస్ట్ పెట్టాడు. మన ప్రత్యర్థుల పై ఇంతకుముందు ఎప్పుడూ బాధపడలేదు. కాని ఇప్పుడు వారిపై ఏదో శక్తి పనిచేసింది. అది మహమ్మద్ సిరాజ్ అని.. తానోక మార్వెల్ అవెంజర్ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. దానిని రీట్వీట్ చేస్తూ ఓ అభిమాని.. సర్, సిరాజ్‌కు ఓ ఎస్యూవీ ఇవ్వండి అని రిక్వెస్ట్ పెట్టాడు. వెంటనే ఆనంద్ దానికి బదులిచ్చాడు. గతంలోనే తనకు ఓ కారు ఇచ్చినట్లు పేర్కొన్నారు. 2021లోనే సిరాజ్‌కు ఓ థార్ ను ఆనంద్ మహీంద్రా బహూకరించారు. ఆసీస్‌తో టెస్టు మ్యాచ్ గెలిచిన తర్వాత సిరాజ్‌కు ఆ కారును బహుమతిగా ఇచ్చారు. అలాగే కొలంబో క్రికెట్ గ్రౌండ్ సిబ్బంది కోసం తన రివార్డును సిరాజ్ ప్రకటించడంపై కూడా స్పందిస్తూ.. సిరాజ్ నిర్ణయం క్లాస్. ఇదేమీ మీ సంపద లేదా మీ నేపథ్యం నుంచి వచ్చేది కాదు. మీలో ఉంటేనే అది బయటకు కనిపిస్తుంది అని ట్వీట్ చేశారు.