»Rohit Sharma 60 Feet Cutout In Hyderabad Fans Birthday Special
Rohit Sharma: 60 ఫీట్ల కటౌట్…ఫ్యాన్స్ బర్త్ డే విషెస్
కొత్త సినిమా వస్తే చాలు పలు థియేటర్ల వద్ద హీరోల భారీ కటౌట్లను ఫ్యాన్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు హీరోలకే కాదు, క్రికెట్ స్టార్లకు కూడా తాజాగా కటౌట్లు ఏర్పాటు చేశారు. ఇది ఏక్కడో కాదు హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఈ భారీ కటౌట్ ఎందుకో ఇక్కడ చుద్దాం.
టీమ్ ఇండియా, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఆదివారం(ఏప్రిల్ 30న) 36వ వయసులోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఈ ఓపెనర్ కోసం ప్రత్యేక సందేశాలు పంపుతున్నారు. కోహ్లీ, యువరాజ్ సింగ్ సహా అనేక మంది ప్రముఖులు తనకు సోషల్ మీడియా వేదికగా విష్ చేశారు.
ఈ క్రమంలో హైదరాబాద్(hyderabad) క్రీడాభిమానులు మాత్రం రోహిత్ శర్మకు సరికొత్తగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అది కూడా మాములుగా కాదు. రోహిత్ శర్మ 36వ బర్త్ డే జరుపుకుంటున్న సందర్భంగా ఫ్యాన్స్ రోహిత్ 60 అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. అంతే కాదు కటౌట్ కాళ్ల దగ్గర ఇండియన్ కెప్టెన్ హ్యాపీ బర్త్ డే అంటూ ఓ బోర్డు కూడా పెట్టారు.
అంతేకాదు ఈ పోస్టర్లను ముంబై ఇండియన్స్(MI) సోషల్ మీడియా టీం తమ ఖాతాలో కూడా షేర్ చేసింది. అంతేకాదు గతంలో కూడా రోహిత్ శర్మ క్రికెట్ ఆడేందుకు హైదరాబాద్‌కు రావడం తనకు చాలా ఇష్టమని, చాలా మంది గొప్ప అభిమానులు ఉన్నారని చెప్పడం విశేషం.
ఇదిలా ఉంటే రోహిత్(Rohit Sharma) తన 36వ పుట్టినరోజు సందర్భంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడనున్నాడు. 2008లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డెక్కన్ ఛార్జర్స్ తరపున రోహిత్ IPL అరంగేట్రం చేశాడు. 234 IPL మ్యాచ్‌లు ఆడిన తర్వాత, క్యాష్ రిచ్ లీగ్‌లో రోహిత్ 6,000కు పైగా పరుగులు చేశాడు.
పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన చివరి రెండు మ్యాచ్‌లలో ఓటమి తర్వాత ముంబై(MI) తిరిగి పుంజుకుంటుంది. ఈ నేపథ్యంలో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టుకు ఈ టోర్నీ కీలకంగా మారింది. ఎందుకంటే ఈ జట్టు ఇప్పటికే రెండు పరాజయాలతో ప్రారంభించి హ్యాట్రిక్ విజయాలతో తిరిగి పుంజుకున్న నేపథ్యంలో ఫ్యాన్స్ మళ్లీ ఈ జట్టు కప్పు గెలవాలని భావిస్తున్నారు.
ఇక రోహిత్(rohit) తన ఫామ్‌ను తిరిగి పొందాలని అభిమానులు భావిస్తున్నారు. అతను ఈ సీజన్లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లలో కేవలం 181 పరుగులు మాత్రమే చేశాడు.