»After Successive Defeats One Win For Sunrisers By Delhi Capitals
IPL 2023: వరస ఓటమిల తర్వాత సన్ రైజర్స్ కి ఒక్క గెలుపు..!
వరస ఓటమిలతో ఢీలా పడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్(sunrisers hyderabad) ఎట్టకేలకు ఒక మ్యాచ్ గెలిచింది. మొన్నటి వరకు అన్ని మ్యాచుల్లోనూ చిత్తుగా ఓడిన ఆరెంజ్ ఆర్మీ.. శనివారం జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ(delhi capitals)ని మట్టికరిపించింది.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్(delhi capitals) తో నిన్న జరిగిన ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్(sunrisers hyderabad).. 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ నిర్దేశించిన 198 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 188 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (35 బంతుల్లో 59, 9 ఫోర్లు), మిచెల్ మార్ష్ (39 బంతుల్లో 63, 1 ఫోర్, 6 సిక్సర్లు)లు భయపెట్టినా చివరికి ఆరెంజ్ ఆర్మీదే విజయం. ఐదు ఓటముల తర్వాత వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకున్న ఢిల్లీకి నిరాశ తప్పలేదు. ఈ విజయంతో సన్ రైజర్స్ పాయింట్ల పట్టికలో ముంబైని వెనక్కినెట్టి 8వ స్థానానికి ఎగబాకింది.
మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 198 పరుగులు(runs) చేసింది. అభిషేక్ శర్మ (67: 36 బంతుల్లో 12×4, 1×6), హెన్రిచ్ క్లాసెన్ (53: 27 బంతుల్లో 2×4, 4×6) అర్ధశతకాలు బాదేశారు. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 6 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (5), రాహుల్ త్రిపాఠి (10), కెప్టెన్ మర్క్రమ్ (8), హారీ బ్రూక్ (0) నిరాశపరిచినా.. స్లాగ్ ఓవర్లలో అబ్దుల్ సమద్ (28: 21 బంతుల్లో 1×4, 2×6), అకేల హుస్సేన్ (16 నాటౌట్: 10 బంతుల్లో 1×4, 1×6) ఫర్వాలేదనిపించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మార్ష్ 4 వికెట్లు పడగొట్టగా.. ఇషాంత్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు.
198 పరుగుల ఛేదనలో ఢిల్లీ(delhi capitals)కి ఫస్ట్‌లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే మరో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (59: 35 బంతుల్లో 9×4)తో కలిసి మిచెల్ మార్ష్ (63: 39 బంతుల్లో 1×4, 6×6) సిక్సర్ల వర్షం కురిపించేశాడు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కి 112 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఢిల్లీ అలవోకగా గెలిచేలా కనిపించింది.
కానీ.. మిడిల్ ఓవర్లలో పుంజుకున్న హైదరాబాద్(hyderabad) బౌలర్లు ఈ ఇద్దరినీ ఔట్ చేయడంతో పాటు మనీశ్ పాండే (1), ప్రియమ్ గార్గె (12), సర్ఫరాజ్ ఖాన్ (9)ని కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టించారు. దాంతో చివర్లో బంతులు, పరుగుల మధ్య అంతరం పెరిగిపోగా అక్షర్ పటేల్ (29 నాటౌట్: 14 బంతుల్లో 1×4, 2×6) హిట్టింగ్ చేసినా ప్రయోజనం లేకపోయింది. అతనితో పాటు క్రీజులో ఉన్న రిపల్ పటేల్ (11 నాటౌట్: 8 బంతుల్లో 1×4) చివర్లో బంతుల్ని వేస్ట్ చేసేశాడు. దాంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు.