»Physically Handicapped Man Cheats Cm Mk Stalin As Wheelchair Cricket Team Skipper Case Booked In Tamil Nadu
Fraud ముఖ్యమంత్రినే మోసం చేసిన ఘనుడు.. ఫొటోలకు ఫోజులన్నీ అబద్ధాలే
2022లో తన నాయకత్వంలో భారత జట్టు ఆసియా కప్ గెలిచినట్లు చెప్పుకున్నాడు. ఇక తాజాగా కొన్ని రోజుల కిందట లండన్ లో జరిగిన టీ-20 ప్రపంచకప్ కూడా గెలిచామని కొత్త కథ అల్లుకున్నాడు. దీనికి ఒక ట్రోఫీ పట్టుకువచ్చి సొంతంగా ప్రచారం చేసుకుంటున్నాడు. ఎంతలా అంటే ఆ డమ్మీ ట్రోఫీ పట్టుకుని మంత్రులను కలిశాడు.
ఆయనో దివ్యాంగుడు (Physically Handicapped).. కానీ మోసాల్లో ఆరితేరిపోయాడు. తన తెలివితేటలతో ఏకంగా ముఖ్యమంత్రిని, మంత్రులను, ప్రజాప్రతినిధులను మోసానికి పాల్పడ్డాడు. తాను సాధించని ఘనతను సాధించినట్టు చెప్పుకోని సీఎం వద్దకు వచ్చి ఫొటోలకు ఫోజులిచ్చారు. ప్రభుత్వం తరఫున సన్మానం పొందారు. అంతటితో ఆగకుండా ఆర్థిక సహాయం కూడా తీసుకున్నాడు. అయితే అతడు మోసగాడు అనే వాస్తవం తెలిసి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అవాక్కయ్యారు. వెంటనే నిందితుడిపై చీటింగ్ కేసు (Cheating Case) నమోదు చేసి జైలుకు పంపించారు. ఈ సంఘటన తమిళనాడులో (Tamil Nadu) చోటుచేసుకుంది.
తమిళనాడులోని రామనాథపురం జిల్లా (Ramanathapuram District) కడలాడి తాలుక కీలచెల్వనూర్ కు చెందిన వినోద్ బాబు (Vinod Babu) దివ్యాంగుడు. తనను తాను వీల్ చైర్ క్రికెట్ (WheelChair Cricketer) ఆటగాడిగా చెప్పుకుంటున్నాడు. ఈ క్రమంలోనే భారత వీల్ చైర్ క్రికెట్ జట్టు కెప్టెన్ (Captain)గా చెప్పుకుంటూ మోసాలకు పాల్పడ్డుతున్నాడు. 2022లో తన నాయకత్వంలో భారత జట్టు ఆసియా కప్ (Asia Cup) గెలిచినట్లు చెప్పుకున్నాడు. ఇక తాజాగా కొన్ని రోజుల కిందట లండన్ (London)లో జరిగిన టీ-20 ప్రపంచకప్ కూడా గెలిచామని కొత్త కథ అల్లుకున్నాడు. దీనికి ఒక ట్రోఫీ పట్టుకువచ్చి సొంతంగా ప్రచారం చేసుకుంటున్నాడు. ఎంతలా అంటే ఆ డమ్మీ ట్రోఫీ పట్టుకుని మంత్రులను కలిశాడు. వారి ద్వారా సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) కలిసి విషయం చెప్పాడు. ప్రతిభ కలిగిన క్రీడాకారుడు అని వినోద్ బాబును సీఎం అభినందించారు. ఈ సందర్భంగా సన్మానించారు. అయితే అతడు మోసగాడు అని ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయానికి (CMO) ఫిర్యాదు వచ్చింది. ఇంటలిజెన్స్ వివరాలు సేకరించగా అతడి అసలు రూపం బహిర్గతమైంది.
అతడి గురించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వినోద్ బాబు అసలు క్రీడాకారుడే కాదు. అతడికి పాస్ పోర్టు (Passport) కూడా లేదని గుర్తించారు. మాయమాటలు, కట్టుకథలు అల్లి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. కాగా వినోద్ బాబును నమ్మి ఓ బేకరీ (Bakery) యజమాని రూ.లక్ష నగదు ఇచ్చారు. పలువురు మంత్రులు కూడా అతడికి ఆర్థిక సహాయం చేశారు. అతడి మోసాలపై రామనాథపురం ఏబీజే మిస్సైల్స్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శరవణ కుమార్ (Shravana kumar) పోలీసులకు ఫిర్యాదు చేశారు. వినోద్ బాబుపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి తెలివిని చూసి అందరూ నివ్వెరపోయారు.