పోలీసులు వాహనాలను నిలిపివేయలేదు. ప్రకాశం బ్యారేజ్ పైకి రాగానే ఎదురుగా పెద్ద సంఖ్యలో వాహనాలు దూసుకొచ్చాయి. ఇక కెనాల్ రోడ్డు వంతెన పైన కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. బందర్ రోడ్డులో కూడా వాహనాలు వీరి కాన్వాయ్ మధ్యలోకి ప్రైవేటు వాహనాలు దూసుకొచ్చాయి.
మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు.. మరొకరు సూపర్ స్టార్ హీరో.. మరో దిగ్గజ నటుడు.. వీళ్లంతా కలిసి కాన్వాయ్ లో వెళ్తుంటే భద్రతా సిబ్బంది (Security) రోడ్డు క్లియరెన్స్ ఇవ్వాలి. వారి పర్యటన విషయంలో నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా చంద్రబాబు కాన్వాయ్ (Convoy)లో ఒక వాహనం దారి తప్పింది. భద్రతా సిబ్బందితో ఉన్న వాహనం తప్పిపోవడంతో కలకలం ఏర్పడింది. అడుగడుగునా పోలీసుల నిర్లక్ష్యం కొట్టిచ్చినట్టు కనిపించింది. జడ్ ప్లస్ (Z plus) కేటగిరి కలిగిన రాజకీయ నాయకుడికి ఇవ్వాల్సిన ప్రొటోకాల్ పాటించలేదు.
విజయవాడ (Vijayawada) శివారులోని కానూరులో మాజీ సీఎం, దివంగత నటుడు ఎన్టీఆర్ (NT Rama Rao) శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టార్ హీరోలు రజనీకాంత్ (Rajinikanth), బాలకృష్ణతో (Balakrishna) పాటు చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) హాజరయ్యారు. అంతకుముందు ఉండవల్లిలోని తన నివాసం నుంచి చంద్రబాబు, రజనీ, బాలయ్య భారీ వాహన శ్రేణితో బయల్దేరారు. సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరగా.. పోలీసులు వాహనాలను నిలిపివేయలేదు. ప్రకాశం బ్యారేజ్ పైకి రాగానే ఎదురుగా పెద్ద సంఖ్యలో వాహనాలు దూసుకొచ్చాయి. ఇక కెనాల్ రోడ్డు వంతెన పైన కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. బందర్ రోడ్డులో కూడా వాహనాలు వీరి కాన్వాయ్ మధ్యలోకి ప్రైవేటు వాహనాలు దూసుకొచ్చాయి.
ఇక చంద్రబాబు వాహన శ్రేణిలోని (Vehicles) ఒక వాహనం దారి తప్పిపోయింది. బెంజి సర్కిల్ దాటాక కాన్వాయ్ నుంచి విడిపోయిన ఆ వాహనం ఐదు కిలోమీటర్ల అనంతరం తాడిగపడ కూడలి వద్ద తిరిగి వాహన శ్రేణిలోకి కలిసింది. దీంతో ఒక్కసారిగా కలకలం ఏర్పడింది. మాజీ ముఖ్యమంత్రితో పాటు పలువురు దిగ్గజాలు ఉన్న వాహనాల విషయంలో ఇలాంటి నిర్లక్ష్యం ఏర్పడడం పోలీసుల నిర్లక్ష్యానికి (Police Negligence) అద్దం పడుతోంది. ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబు భద్రతలో ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్ డబ్ల్యూ) ISW, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) NSGతో పాటు మూడో అంచెలో సాయుధ రిజర్వ్ పోలీస్ బృందం (ఏఆర్ పార్టీ) AR Party ఉంటుంది. ఈ మూడు కలిసి చంద్రబాబు భద్రత బాధ్యతలను చూస్తాయి. బాబు వెంట నిరంతరం ఉండాల్సిన వీరికి తొలిసారి ఇలాంటి ఆటంకం ఏర్పడింది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇలాంటి నీచపు రాజకీయాలకు పాల్పడుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.