»Non Stop Rain In Hyderabad Twin Cities Meteorological Department Issued Orange Alert
Heavy Rain హైదరాబాద్లో దంచికొట్టిన వాన.. పలు సేవలకు అంతరాయం
మూడు గంటల పాటు నగరవ్యాప్తంగా ఏకధాటిగా వర్షం కురవడంతో రోడ్లపైకి భారీగా వరద చేరింది. చాలా ప్రాంతాల్లో తెరపినివ్వకుండా వర్షం పడింది. కాగా వర్షం వలన పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తెల్లవారుజామున వర్షం రావడంతో పేపర్ వేసేవాళ్లు, పాలవారు, పారిశుద్ధ్య సిబ్బంది పనులకు ఆటంకం ఏర్పడింది.
అకాల వర్షాలు (Untimely Rains) తెలంగాణను (Telangana) చుట్టుముట్టేస్తున్నాయి. జిల్లాల్లో భారీగా పడుతున్న వర్షాలు ఇప్పుడు హైదరాబాద్ (Hyderabad) చేరాయి. శనివారం తెల్లవారుజాము నుంచి దాదాపు మూడు గంటల వరకు కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు (Lowest Places) మునిగిపోయాయి. రోడ్లన్నీ చెరువులుగా మారాయి. పలుచోట్ల డ్రైనేజీలు (Drainages) మూసుకుపోయి మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోయాయి. ఉదయం 5 గంటల నుంచి ఎడతెరపిలేకుండా వాన కురిసింది. ఉదయం 7.30 తర్వాత వర్షం విరామం ప్రకటించింది.
మూడు గంటల పాటు నగరవ్యాప్తంగా ఏకధాటిగా వర్షం కురవడంతో రోడ్లపైకి భారీగా వరద చేరింది. కేపీహెచ్ బీ కాలనీ, కూకట్ పల్లి, ఎస్సార్ నగర్, పంజాగుట్ట, లక్డీకాపూల్, కోఠి, మలక్ పేట, దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, బాలానగర్, అఫ్జల్ గంజ్, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో తెరపినివ్వకుండా వర్షం పడింది. కాగా వర్షం వలన పలుచోట్ల విద్యుత్ సరఫరాకు (Power Cuts) అంతరాయం ఏర్పడింది. తెల్లవారుజామున వర్షం రావడంతో పేపర్ వేసేవాళ్లు (Paper Boys), పాలవారు (Milkmans), పారిశుద్ధ్య సిబ్బంది (Sanitary Staff) పనులకు ఆటంకం ఏర్పడింది. వర్షం తగ్గినా హైదరాబాద్ అంతటా మేఘాలు అలుముకున్నాయి. కాగా మరో 3 గంటల పాటు హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (Meteorological Department) హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పలు సేవలకు అంతరాయం ఏర్పడడంతో వెంటనే జీహెచ్ ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగింది. విద్యుత్, పారిశుద్ధ్య, ట్రాఫిక్, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ బీ తదితర బృందాలు సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు రంగంలోకి దిగాయి.