మాస్ మహారాజా రవితేజ నటించి, నిర్మించిన చిత్రం రావణాసుర(ravanasura). ఈ చిత్రం దేశ వ్యాప్తంగా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 5 కోట్లు రాబట్టింది. ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించగా, శ్రీకాంత్ విసా కథను అందించారు.
గత రెండు చిత్రాలైన ధమాకా, వాల్తేరు వీరయ్య విజయాలతో మంచి జోరుమీదున్న హీరో రవితేజ(ravi teja)కు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఎందుకంటే నిన్న విడుదలైన రావణాసుర(ravanasura) చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. స్వామి రారా ఫేమ్ సుధీర్ వర్మ(sudheer varma) దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ రావణాసురలో రవితేజ లాయర్‌గా నటించారు. ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాగా…ఈ చిత్రాన్ని రవితేజనే స్వయంగా నిర్మించాడు. అయితే ఈ మూవీ మొదటి రోజు ఎంత కలెక్షన్లు సాధించిందో ఇప్పుడు చుద్దాం.
మిక్స్డ్ రివ్యూలను దక్కించుకున్న క్రైమ్ థ్రిల్లర్ రావణాసుర మొదటి రోజున 4.9 కోట్ల షేర్ సాధించింది. గ్రాస్ ఫిగర్ తొమ్మిది కోట్లకు చేరుకుంది. అయితే మొదటి రోజు 11 కోట్ల గ్రాస్ వసూలు చేసిన రవితేజ చిత్రం ధమాకా కంటే ఇది కొంచెం తక్కువ అని చెప్పవచ్చు. ధమాకా పూర్తి మాస్ కమర్షియల్ డ్రామా అయితే రావణాసుర మాత్రం సీరియస్ సినిమాగా తెరకెక్కించారు. అయితే తొలి రోజు కలెక్షన్లే ఇలా ఉంటే వచ్చే రోజుల్లో ఇంకా వసూళ్లు తగ్గే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఈ చిత్రానికి ఖర్చు పెట్టిన 50 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని సినీ వర్గాలు అంటున్నాయి.
మరోవైపు నాని దసరా చిత్రం కూడా మిశ్రమ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద చాలా బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో రవితేజ రావణాసుర చిత్రం పోటీలో ఉంటుందో లేదో చూడాలి. రావణాసుర చిత్రంలో రవితేజ నెగిటివ్ రోల్లో కనిపించాడు. అతను ఇలాంటి పాత్ర చేయడం ఇదే మొదటిసారి. దీంతో అతని నటనకు చాలా ప్రశంసలు వచ్చాయి. కానీ మూవీ మాత్రం ప్లాప్ టాక్ దక్కించుకుంది. ఈ చిత్రంలో ఐదుగురు కథానాయికలు ఫరియా అబ్దుల్లా, దక్షనాగార్కర్, మేఘా ఆకాష్, అను ఇమ్మానుయేల్ కీలక పాత్రలు పోషించారు. కానీ ధమాకాతో పోల్చుకుంటే, రావణాసురలో వినోదం తక్కువగా ఉందని చెప్పవచ్చు.