ప్రముఖ దర్శకుడు రవిబాబు, నటి పూర్ణ నటించిన 'అసలు' మూవీ ట్రైలర్(asalu movie trailer) విడుదలైంది. ఓ ప్రొఫేసర్ ను ఎందుకు చంపావ్ అనే డైలాగ్ తో కొనసాగుతున్న ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది.
ప్రముఖ దర్శకుడు రవిబాబు తానే స్టోరీ అందించి స్వయంగా నిర్మించిన వెబ్ మూవీ అసలు(asalu). దీనికి ఉదయ్, సురేష్ దర్శకత్వం వహించారు. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్లో తెరకెక్కిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో సూర్య, రవిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 13న OTT ప్రీమియర్‌కు ముందు రానున్న నేపథ్యంలో ఈరోజు ట్రైలర్(trailer)ను ఆవిష్కరించారు.
ట్రైలర్ చూస్తే ఓ ఉన్నత స్థాయి ప్రొఫెసర్ చక్రవర్తి హత్య నేపథ్యంలో మూవీ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఆ హత్య చేసిన నేరస్థుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక పరిశోధనా అధికారితో మొదలవుతుంది. కథలో నలుగురు అనుమానితులు – రాకేష్, శేషగిరిరావు, హేమ, కిషన్ కనిపిస్తారు. మరోవైపు ఈ కేసును చేధించడంతోపాటు వారి దగ్గరి నుంచి రహస్యాలను వెలికితీయడంతోపాటు అర్థం చేసుకోవడానికి రవిబాబు ప్రయత్నిస్తుంటాడు. మరోవైపు కొన్ని ఉత్కంఠ రేపే సీన్ల మధ్యలో నటి పూర్ణ యాక్ట్ చేసింది.
అసలు అనేది ఈనాడు గ్రూప్ OTT ప్లాట్‌ఫారమ్ ETV విన్ కోసం ప్రత్యేకంగా సృష్టించబడిన వెబ్ ఒరిజినల్. ఈ డిజిటల్ చిత్రానికి రచయిత, నిర్మాత రవిబాబు కాగా, ఉదయ్, సురేష్ దర్శకత్వం వహించారు. ఇక చిత్రానికి ఎస్.ఎస్.రాజేష్ సంగీతం సమకూర్చగా, చరణ్ మాధవనేని కెమెరాను అందించారు. ఆర్ట్ డైరెక్టర్‌గా నారాయణ రెడ్డి, ఎడిటర్‌గా సత్యనారాయణ బల్లా వ్యవహరిస్తున్నారు. రిద్ది తమ్మారెడ్డి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. సూరి, దూది శ్రీనివాస్ కాస్ట్యూమ్స్, మేకప్ చూసుకున్నారు.
మరోవైపు రవిబాబు(Ravi Babu), పూర్ణ(purna) గతంలో ఆవిరి, అవును, అవును 2, అదుగో వంటి వరుస చిత్రాల్లో కలిసి నటించారు. అసలుతో వీరిద్దరు కలిసి చేయడం ఇది ఐదవసారి కావడం విశేషం. దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్ అలీని ఇటీవలే పెళ్లి చేసుకున్న పూర్ణ ఈ వారం ప్రారంభంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె నాని, కీర్తి సురేష్ నటించిన దసరా చిత్రంలో షైన్ టామ్ చాకో ఆన్-స్క్రీన్ భార్యగా కూడా కీలక పాత్ర పోషించింది.