Sai dharam Tej: విరూపాక్ష ట్రైలర్ విడుదల..ఎవరికైనా చావుకు ఎదురెళ్లే దమ్ముందా?
సాయి ధరమ్ తేజ్(Sai dharam Tej) నటించిన మిస్టికల్ థ్రిల్లర్ విరూపాక్ష మూవీ ట్రైలర్(Virupaksha movie Trailer) ఈరోజు(ఏప్రిల్ 11న) విడుదలైంది. వీడియో చూస్తే ఉత్కంఠతో కూడిన సీన్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంటుంది. కార్తీక్ దండు(Karthik Dandu) దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సాయి ధరమ్ తేజ్(Sai dharam Tej) యాక్ట్ చేసిన మిస్టికల్ థ్రిల్లర్ విరూపాక్ష(Virupaksha) ట్రైలర్(Trailer)ను మేకర్స్ మంగళవారం ఉదయం రిలీజ్ చేశారు. వీడియోలో హీరో వెళుతున్న కారుకు ఆకస్మాత్తుగా ఓ కాకి ఎదురు వచ్చి చనిపోవడం చూడవచ్చు. అంతేకాదు ఆ తర్వాత వెంటనే ఆకాశంలో అనేక కాకులు అరుపులు శబ్దాలు చేస్తున్న సీన్స్ ఉత్కంఠగా అనిపిస్తుంది. దీంతోపాటు ఓ గ్రామంలో జరుగుతున్న వరుస చావులకు తాను కారణం తెలుసుకుని తీరతానని హీరో చెప్పడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది.
అదే క్రమంలో నటుడు సునీల్(sunil) సినిమాలో భాగంగా ఎవరికైనా చావుకు ఎదురెళ్లే దమ్ముందా అని ప్రశ్నించడం అసలు ఈ మూవీలో ఏం జరుగుతోందనే ఉత్కంఠ సినీ ప్రియుల్లో మొదలైంది. మరోవైపు ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, టీజర్ సహా కొన్ని పాటలు సినిమా పట్ల ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వచ్చిన ట్రైలర్ థ్రిల్‌తో నిండిపోయి..అనేక ప్రశ్నలను సృష్టిస్తుందని చెప్పవచ్చు. అవన్నీ తీరాలంటే మాత్రం ఈ సినిమా చూడాల్సిందే.
ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్(Samyuktha Menon) ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేశారు. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు కార్తీక్ దండు(Karthik Dandu) డైరెక్షన్ చేశారు. మరోవైపు ఈ సినిమాకు ప్రముఖ రచయిత, దర్శకుడు సుకుమార్..తన సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై ఆయన సహ నిర్మాతగా ఈ చిత్రానికి వ్యవహరిస్తున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్, అతని నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కాంతారా మూవీకి సంగీతం అందించిన కన్నడ సంగీత దర్శకుడు బి అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించారు. నవీన్ నూలి ఎడిటింగ్ అందించగా, ఉప్పెన సినిమాటోగ్రాఫర్ శామ్‌దత్ ఈ చిత్రానికి కెమెరా వర్క్ చేశారు. ఏప్రిల్ 21న విరూపాక్ష మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.