»Nani Dasara Movie Joins 2 Million Club In Usa Box Office
USAలో 2 మిలియన్ క్లబ్ లో చేరిన నాని దసరా మూవీ
న్యాచురల్ స్టార్ నాని(Nani)నటించిన దసరా మూవీ(Dasara movie) విడుదలై 10 రోజులైనా కూడా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. యునైటెడ్ స్టేట్స్(USA)లో కలెక్షన్ల హావా సృష్టిస్తోంది. ఈ క్రమంలో తాజాగా నాని దసరా చిత్రం 2 మిలియన్ డాలర్ల వసూళ్లు వసూళ్లు దాటేసి రికార్డు క్రియేట్ చేసింది.
న్యాచురల్ స్టార్ నాని(nani) యాక్ట్ చేసిన ‘దసరా’ మూవీ(Dasara movie) విడుదలై 10 రోజులు దాటినా కూడా ఇంకా కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. నాని కెరీర్లో చేసిన ఊరమాస్ చిత్రమిది. అంతేకాదు నాని ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ కూడా ఇదే కావడం విశేషం. శ్రీకాంత్ ఓదెల(srikanth odela) దర్శకత్వం వహించిన ఈ చిత్రం తాజాగా అమెరికాలో సరికొత్త రికార్డు సృష్టించింది. నాని కేరిర్‌లో యూఎస్ఏ(USA) బాక్సాఫీస్ వద్ద 2 మిలియన్ డాలర్ల వసూళ్లను దసరా చిత్రం దాటేసింది. దీంతో గతంలో బలే బలే మగాడివోయ్ చిత్రానికి USAలో నాని అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఉన్న రికార్డు చెరిగిపోయింది.
ఈ నేపథ్యంలో దసరాతో నాని తన కెరీర్లో రెండు మైలురాళ్లు సాధించాడు. దసరాతో ప్రపంచవ్యాప్తంగా 110 కోట్ల గ్రాస్, USAలో $2 మిలియన్ల వసూళ్ల రికార్డులను దక్కించుకున్నాడు. మరోవైపు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్ల షేర్ మార్క్ దిశగా దూసుకుపోతోంది. ఇంకోవైపు తెలుగు రాష్ట్రాల్లో తాజాగా విడుదలైన చిత్రాలు కూడా వైఫల్యం కావడంతో దసరా చిత్రానికి పోటీ లేకుండా పోయింది. ఈ క్రమంలో దసరా బాక్సాఫీస్ వద్ద మరిన్ని కలెక్షన్లు సాధిస్తుందని సినీ వర్గాలు అంటున్నాయి. దసరాకు సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మించగా, శ్రీకాంత్ ఓదెల(srikanth odela) దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్(Keerthy Suresh), దీక్షిత్ శెట్టి తమ మెచ్చుకోదగిన నటనతో మెప్పించారు.
స్టార్ నేచురల్‌గా నాని దసరా రెండవ వారం థియేట్రికల్ రన్ ప్రారంభమైంది. ఇంకా ఈ సినిమాకు బిజినెస్ జోరుగా సాగుతోంది. కెరీర్ ప్రారంభం నుంచి నానికి కంచుకోటగా నిలిచిన ఈ సినిమా యూఎస్ఏ బాక్సాఫీస్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ఇప్పటికే అతని మునుపటి US బాక్సాఫీస్ హిట్ బలే బలే మగాడివోయ్ని అధిగమించింది. మరోవైపు ఇండియాలో అతని అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా దసరా నిలిచింది. మార్చి 30న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా థియేటర్లలోకి విడుదలైంది.