Nikhil : ప్రస్తుతం యంగ్ హీరో నిఖిల్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. కార్తికేయ 2తో పాన్ ఇండియా లెవల్లో భారీ విజయాన్ని అందుకున్నాడు నిఖిల్. దేశ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. పాన్ ఇండియా హీరోల లిస్ట్ తీస్తే.. అందులో నిఖిల్ కూడా ఉంటాడు. అందుకే నిఖిల్ సినిమాలకు భారీ డిమాండ్ ఏర్పడుతోంది.
ప్రస్తుతం యంగ్ హీరో నిఖిల్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. కార్తికేయ 2తో పాన్ ఇండియా లెవల్లో భారీ విజయాన్ని అందుకున్నాడు నిఖిల్. దేశ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. పాన్ ఇండియా హీరోల లిస్ట్ తీస్తే.. అందులో నిఖిల్ కూడా ఉంటాడు. అందుకే నిఖిల్ సినిమాలకు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. కార్తికేయ 2 తర్వాత 18 పేజెస్ అంటూ లవ్ స్టోరీతో వచ్చాడు నిఖిల్. ఈ సినిమా పర్వాలేదనిపించింది. ఇక ఈ సినిమా తర్వాత మరోసారి పాన్ ఇండియా టార్గెట్గా ‘స్పై’ అనే సినిమాతో రాబోతున్నాడు నిఖిల్. ప్రముఖ ఎడిటర్ గ్యారీ BH ‘స్పై’ మూవీతో డైరెక్టర్ పరిచయం అవుతున్నారు. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమ్మర్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బిజినెస్ లెక్కలు స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్, స్టార్ నెట్ వర్క్ భారీగా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఏకంగా 40 కోట్లకు డిజిటల్, శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే సినిమా రషెస్ చూసిన తర్వాతే ఇంత మొత్తం చెల్లించడానికి రెడీ అయినట్టు సమాచారం. ఇక నాన్ థియేట్రికల్ బిజినెస్ ఇలా ఉంటే.. థియేట్రికల్ బిజినెస్ కూడా ఓ రేంజ్లో ఉంటుందని అంటున్నారు. అన్ని భాషలలో కలిపి 50, 60 కోట్ల బిజినెస్ జరిగినా.. మొత్తంగా నిఖిల్ సినిమా 100 కోట్లను టచ్ చేస్తుందని అంటున్నారు. మరి అంచనాలను పెంచేస్తున్న స్పై మూవీతో నిఖిల్ మరో వంద కోట్లను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.