అదేంటి.. రామ్ చరణ్, నిఖిల్ కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారా? అనే సందేహాలు రావొచ్చు. కానీ అలాంటిదేం లేదు. రామ్ చరణ్ నిర్మాణంలో నిఖిల్ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలైంది.
Ram Charan: ట్రిపుల్ ఆర్ తర్వాత ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబుతో ఆర్సీ 16 చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ తర్వాత సుకుమార్‌తో ఆర్సీ 17 చేయనున్నాడు. ఇదిలా ఉంటే.. సినిమాలతో పాటు సినిమాలను నిర్మిస్తున్నాడు కూడా చరణ్. ఇప్పటికే యూవీ క్రియేషన్స్‌లో ఒకరైన విక్రమ్ రెడ్డితో కలిసి కొత్తగా ‘వి మెగా పిక్చర్స్’ బ్యానర్ స్థాపించారు. ఈ బ్యానర్లో ఫస్ట్ సినిమా యంగ్ హీరో నిఖిల్‌తో చేస్తున్నారు. గత్లోనే ‘ది ఇండియా హౌస్’ పేరుతో ఈ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కూడా నిర్మాణ భాగస్వామి కానుంది. ‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా రేంజ్ పాపులారిటీ సొంతం చేసుకున్నాడు నిఖిల్.
అభిషేక్ అగర్వాల్‌తో నిఖిల్‌కు మంచి పరిచయం ఉంది. అందుకే ఈ ప్రాజెక్ట్‌లో నిఖిల్ హీరోగా ఫిక్స్ అయిపోయాడు. ఈ సినిమాతో రామ్ వంశీ కృష్ణ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ‘ది ఇండియా హౌజ్’ స్వాతంత్ర సమరయోధుడు ‘వీర్ సావర్కర్’ కథతో తెరకెక్కబోతోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్‌ని హంపిలోని విరూపాక్ష ఆలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ప్రస్తుతం నిఖిల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. స్వయంభు కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోది. అలాగే.. కార్తికేయ 3 కూడా లైన్లో ఉంది.