టాలీవుడ్ స్టార్ హీరో నిఖిల్(Nikhil Siddharth) యాక్ట్ చేసిన పాన్ ఇండియా మూవీ స్పై నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా సుభాష్ చంద్రబోస్(Subhas Chandrabose) మరణం వెనుక ఉన్న రహస్యాల నేపథ్యంలో తెరకెక్కించగా ఈ మూవీ మిశ్రమ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం తొలిరోజు ఎంత కలెక్షన్లు వసూలు చేసిందో ఇప్పుడు చుద్దాం.
హీరో నిఖిల్ సిద్ధార్థ్(Nikhil Siddharth) యాక్ట్ చేసిన స్పై(spy) మూవీ నిన్న విడుదలై మిశ్రమ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఎంత కలెక్షన్లు సాధించిందో ఇప్పుడు చుద్దాం. అయితే తొలిరోజు నిఖిల్ స్పై మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.11.70 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి రూ.6 కోట్లను వసూలు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో నైజాం నుంచి రూ.1.72 కోట్లు, సీడెడ్ నుంచి రూ.56 లక్షలు, ఉత్తరాంధ్ర నుంచి రూ. 54 లక్షలు, తూర్పు నుంచి రూ.33 లక్షలు, పశ్చిమ నుంచి రూ.22 లక్షలు, గుంటూరు నుంచి రూ.48 లక్షలు, కృష్ణ నుంచి రూ.25 లక్షలు, నెల్లూరు నుంచి రూ.18 లక్షలు వసూలయ్యాయి.
ఈ కలెక్షన్లను బట్టి చూస్తే ఇండియాతోపాటు విదేశాల్లో ఈ చిత్రానికి పోటీగా దాదాపు 5 కోట్ల రూపాయలు కలెక్షన్లు రావడం విశేషం. ఇదే జోరు మరో నాలుగు రోజులు కొనసాగితే పెట్టిన బడ్జెట్ తోపాటు లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 40 నుంచి 50 కోట్ల రూపాయలు అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి గ్యారీ Bh దర్శకత్వం వహించి, ఎడిటింగ్ చేయగా..నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్యా మీనన్, ఆర్యన్ రాజేష్, జిషు సేన్‌గుప్తా, మకరంద్ దేశ్‌పాండే సహా పలువురు కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు.
Nikhil has attained his career's biggest opening, grossing a staggering ₹11.70 Cr 💥💥#SpyMovie continues to dominate the box office, with housefull shows and additional screenings being added in various locations 🔥