ప్రస్తుతం థియేటర్లో ఉన్న పెద్ద సినిమా యానిమల్ మాత్రమే. ఈ వారంలో తెలుగులో నాని, నితిన్ కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ హిందీలో మాత్రం యానిమల్ దే హవా. ఇప్పటి వరకు ఐదు రోజుల్లో భారీ వసూళ్లను రాబట్టింది యానిమల్.
అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్(ranbir kapoor), రష్మిక(Rashmika Mandanna) జంటగా నటించిన యానిమల్(animal) మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేస్తోంది. ఇప్పటికే భారీ వసూళ్లను రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది యానిమల్. డిసెంబర్ 1న గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా.. మొదటి మూడు రోజుల్లోనే రూ.356 కోట్ల మార్క్‌ని రీచ్ అయింది. ఇక మండేతో రూ.425 కోట్లు గ్రాస్ కలెక్షన్లను క్రాస్ చేసింది. మంగళ వారంతో కలుపుకొని మొత్తంగా ఐదు రోజుల్లో రూ.481 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టి.. రూ.500 కోట్ల దిశగా దూసుకుపోతోంది.
దీంతో ఫస్ట్ వీకెండ్లో రూ.500 కోట్లు క్రాస్ చేసి.. సెకండ్ వీకెండ్ వరకు మరో 200 కోట్లు ఈజీగా కొల్లగొడుతుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. దీంతో రణ్‌బీర్ కపూర్ కెరీర్లోనే యానిమల్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచేలా ఉంది. తెలుగులోను యానిమల్ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయింది. ఇప్పటికే రూ.45 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాను దాదాపు రూ.15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో తెలుగులో నిర్మాత దిల్‌రాజు రిలీజ్ చేశారు. కానీ మూడు రోజుల్లో దిల్‌రాజుకు లాభాలు తెచ్చిపెట్టింది యానిమల్.
ఇక రూ.210 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ అయినా యానిమల్ మూవీ మొదటి రెండు రోజుల్లోనే అన్ని సెంటర్స్‌లో బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి సత్తా చాటింది. దీంతో లాంగ్ రన్లో యానిమల్ కలెక్షన్స్ గట్టిగానే ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం హిందీలో పెద్ద సినిమాలేవి రిలీజ్‌కు రెడీగా లేవు. కాబట్టి యానిమల్ మూవీ కలెక్షన్స్‌లో డ్రాప్ కనిపించే అవకాశం లేదు. మరి ఫైనల్ రన్లో యానిమల్ ఎంత రాబడుతుందో చూడాలి.