స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna)-విజయ్(vijay)తో విడిపోయి.. బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas)తో డేటింగ్(dating) చేస్తున్నట్లు నెట్టింట పుకార్లు వస్తున్నాయి. ముంబయి విమానాశ్రయంలో ఇటీవల వీరిద్దరు జంటగా కనిపించారని పలువురు చర్చించుకుంటున్నారు. మరోవైపు రష్మిక, శ్రీనివాస్ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారని.. ఇటీవల తరచుగా కలుస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ న్యూస్ నిజమో కాదో తెలియాలంటే వీరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే.
స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) విజయ్ దేవరకొండతో విడిపోయారని..ప్రస్తుతం మందన్న బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas)తో డేటింగ్(dating) చేస్తుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రష్మిక మందన్న దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో ఒకరిగా ఉన్నారు. ప్రాంతీయ చిత్రాలతోపాటు బాలీవుడ్ రంగంలో కూడా ప్రవేశించి దేశవ్యాప్తంగా తనదైన గుర్తింపు దక్కించుకుంది కర్ణాటక బ్యూటీ. ఈ క్రమంలో ఆమె ఎవరితోనైనా డేటింగ్ చేస్తున్నారా లేదా అనే దానిపై గత రెండు రోజులుగా అనేక వార్తలు వస్తున్నాయి.
అయితే ఇప్పటికే గతంలో రష్మిక మందన్న గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సహనటుడు విజయ్ దేవరకొండతో రిలేషన్ షిప్లో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే ఇప్పుడు మరో సౌత్ ఇండియన్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఆమె పలు మార్లు కనిపించడం పట్ల వీరు డేటింగ్లో ఉన్నట్లు వినిపిస్తోంది. వారి ఫొటోలు సైతం ఇంటర్నెట్ అంతటా వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో రష్మిక మందన్న చత్రపతి నటుడితో డేటింగ్ చేస్తుందా అని అభిమానులు ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు.
అయితే రష్మిక, బెల్లంకొండ శ్రీనివాస్ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారనే వార్త నిజమే కాదో ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విషయంపై ఇప్పటి వరకు శ్రీనివాస్, రష్మిక ఎవరూ కూడా అధికారికంగా స్పందించలేదు. గతంలో డియర్ కామ్రేడ్, గీతా గోవిందం చిత్రాలలో విజయ్(vijay deverakonda) తో కలిసి రష్మిక(Rashmika) స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ క్రమంలో వీరి డేటింగ్ గురించి వార్తలు(news) రాగా రష్మిక కాదని తెలిపింది. రష్మిక విజయ్ను ‘మంచి స్నేహితుడు’ అని పిలిచింది. మరోవైపు ఇది వరకే విజయ్, రష్మిక కూడా కలిసి విహారయాత్రలకు వెళ్ళినట్లు ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇక రష్మిక మందన్న(Rashmika Mandanna) ఇటీవల వరిసు చిత్రంలో కనిపించింది. దీంతోపాటు నటి సందీప్ రెడ్డి వంగా యానిమల్ చిత్రంలో రణబీర్ కపూర్ సరసన యాక్ట్ చేస్తుంది. మరోవైపు బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహించారు.