రాం చరణ్, ఎన్టీఆర్ యాక్ట్ చేసిన RRR మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫేమస్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు RRR2 కూడా ఉంటుందని రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్(vijayendra prasad) పేర్కొన్నారు. అయితే ఈ మూవీకి మాత్రం రాజమౌళి దర్శకత్వం చేయడం లేదని తెలుస్తోంది.
రాజమౌళి(Rajamouli)రూపొందించిన భారీ చిత్రం RRRని సినీ ప్రేమికులు మర్చిపోలేరు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులకు మంత్రముగ్ధులను చేసింది. మొట్ట మొదటిసారి ఓ తెలుగు సినిమాకు ఆస్కార్ వచ్చింది అంటే, ఇది ఈ సినిమాతోనే సాధ్యమైంది. ఈ మూవీలోని నాటు నాటు పాటకు ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ వచ్చింది. అయితే, దీనికి ఇప్పుడు రెండో భాగం కూడా ఉందని ఇటీవల వార్తలు రావడం మొదలయ్యాయి.
ఇదే విషయమై రాజమౌళి తండ్రి, స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్(vijayendra prasad) రచయిత స్పందించారు. కచ్చితంగా ఆర్ఆర్ఆర్ కి రెండో భాగం ఉంటుందని చెప్పారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రాజెక్ట్‌లో భాగం అవుతారని కూడా చెప్పారు. అయితే రాజమౌళి దీనికి దర్శకత్వం వహించరు. అని చెప్పి బాంబు పేల్చారు. రాజమౌళి దర్శకత్వం వహించనప్పుడు RRR2లో ఎవరైనా ముఖ్యంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎందుకు నటిస్తారనే అనుమానం అందరిలోనూ మొదలైంది.
రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు అనేది ఇన్ సైడ్ టాక్. నిజానికి, కార్తికేయ RRR కోసం రెండవ యూనిట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అతను చాలా ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించాడు. అంతే కాకుండా, ఆర్ఆర్ఆర్కి అంతర్జాతీయ గుర్తింపు, ఆస్కార్లను ప్రతిష్టాత్మకంగా పొందడంలో కార్తికేయ కీలక పాత్ర ఉందనే చెప్పవచ్చు. ఒకవేళ కార్తికేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించకపోతే, Rrr 2 చిత్రానికి భ్రమాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయాన్ ముఖర్జీపై రాజమౌళి ఇటివల ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.