»Priyanka Nalkari Is An Actress Who Got Married Secretly At Malasia Temple
Priyanka Nalkari: రహస్యంగా పెళ్లి చేసుకున్న నటి ప్రియాంక నల్కారి
రోజా సీరియల్ నటి ప్రియాంక నల్కారి(Priyanka Nalkari) రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. మలేషియాలోని మురుగన్ ఆలయంలో తన ప్రియుడిని మనువాడారు. ఈ సందర్భంగా వివాహం చేసుకున్న ఫొటోలను తన ఇన్ స్టా గ్రాంలో పోస్ట్ చేసి వెల్లడించింది.
రోజా సీరియల్ నటి ప్రియాంక నల్కారి(Priyanka Nalkari) రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. మలేషియాలోని మురుగన్ ఆలయంలో తన ప్రియుడిని మనువాడారు. ఈ సందర్భంగా వివాహం చేసుకున్న ఫొటోలను తన ఇన్ స్టా గ్రాంలో పోస్ట్ చేసి వెల్లడించింది. రాహుల్ వర్మ అనే వ్యాపారవేత్తతో ఆమె గతంలో ప్రేమలో ఉండగా..తాజాగా పెళ్లి చేసుకుంది. ఇది చూసిన నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇంకొంత మంది హ్యాప్పీ మ్యారేజ్ లైఫ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక కపుల్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అయితే ప్రియాంక నల్కారి స్వస్థలం తెలంగాణలోని హైదరాబాద్(hyderabad). ఈమె 2010లో తెలుగు చిత్రం అందరి బంధువయాతో నటిగా రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత తమిళంలో కుమారు, సంథింగ్ సమ్‌థింగ్, కాంచన 3 వంటి చిత్రాల్లో నటించారు. సినీ రంగంలో పెద్దగా ఆదరణ లభించక పోవడంతో ప్రియాంక నలగారి సీరియల్స్ వైపు వెళ్లింది. ఈటీవీ తెలుగులో ప్రసారమైన మేఘమాల అనే తెలుగు సీరియల్లో నటించింది. ప్రియాంక కామెడీ రియాలిటీ షో అనుభవించు రాజాలో కూడా నటించింది. శివ మనసులో శృతి (2012)లో సుధీర్ బాబు సోదరి పాత్రను కూడా పోషించింది. 2015 నుంచి తెలుగు సీరియల్స్లలో నటిస్తోంది.
ఆ క్రమంలో ప్రియాంక 2018లో ప్రారంభించిన రోజా అనే సీరియల్‌తో తమిళంలోకి ప్రవేశించింది. అందులో నటుడు సిపుకి జంటగా నటించింది ప్రియాంక. రోజా సీరియల్ ముగిసిన తర్వాత ప్రియాంక ప్రస్తుతం సీతారామన్ అనే సీరియల్లో నటిస్తోంది. ఈ సిరీస్‌కి ప్రజల్లో కూడా మంచి స్పందన వస్తోంది. ఇందులో ప్రముఖ విల్లీ నటి రేష్మా పసుపులేటి కూడా నటిస్తోంది. ఈ సీరియల్ జీ తమిళ్లో ప్రసారం అవుతోంది.