»Ponguleti Srinivas Reddy Comments On Telangana Government A New Secretariat In Telangana Corona Time
Ponguleti Srinivasa Reddy: కరోనా కాలంలో కొత్త సచివాలయం అవసరమా
తెలంగాణ ప్రభుత్వ పథకాలు, సీఎం కేసీఆర్ విధానాలపై మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా పొంగులేటీ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో రైతులకు 24 గంటల కరెంట్, ధరణీ సమస్యలు, నిరుద్యోగం సహా అనేక ఇబ్బందులు ఉన్నట్లు శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేశారు.
సీఎం కేసీఆర్(cm kcr)ప్రభుత్వం గొప్పల ప్రభుత్వమని మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy) ఆరోపించారు. కరోనా(corona) కాలంలో రైతుల రుణమాఫీ(rythu runa mafi)ని అమలు చేయలేదు. కానీ అదే సమయంలో కొత్త సచివాలయం నిర్మాణానికి నిధులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. వందల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేస్తున్నారని వెల్లడించారు. తెలంగాణలో 24 గంటల కరెంట్ రైతులకు ఇస్తున్నామని చెప్పుడే తప్ప అది అమలులో లేదని పేర్కొన్నారు. ఫ్రీగా 24 గంటల కరెంట్ ఇస్తే అనేక ప్రాంతాల్లో రైతులు రోడ్లపైకి వచ్చి ఎందుకు ఆందోళనలు చేపట్టారని నిలదీశారు. ఖమ్మం జిల్లా(Khammam district) వైరా(wyra)లో మార్క్ ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్ ఆధ్వర్యంలో చేపట్టిన నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా పొంగులేటీ పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు ధరణీ స్కీం(dharani scheme) ద్వారా అనేక మంది రైతులు తమ భూములను కోల్పోయారని గుర్తు చేశారు. మరికొంత మంది భూముల మార్పు సహా అనేక సమస్యలు ఇంకా తీరలేదని గుర్తు చేశారు. ప్రతి రోజు అనేక మంది ధరణీ సమస్యలు పరిష్కరించాలని కార్యాలయాల చుట్టు తిరుగుతున్నట్లు వెల్లడించారు. ఇంకా ఎప్పటికీ ఈ సమస్యలు పరిష్కారం అవుతాయో తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చెప్పాలన్నారు. అనేక సమస్యలు ఉన్నాయని తెలిసినా కూడా బయటకు మాత్రం అసలు సమస్యలే లేనట్లు అధికార పార్టీ నేతలు నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ బడ్జెట్(Telangana budget) విషయంలో కూడా గొప్పలు తప్ప ఇంకేం లేదని పొంగులేటి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ గొప్పల ప్రభుత్వానికి ప్రజలు వచ్చే ఎన్ని బుద్ది చెప్పాలని అన్నారు.
గత తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రజలు అనుకున్న వాటిని ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏ మేరకు నెరవేర్చిందో ఆత్మపరిశీలన చేసకోవాలని ప్రజలకు పొంగులేటీ సూచించారు. మరోవైపు పార్టీలో తనకు అనకూలంగా ఉన్న వారికే ప్రైవేటు యూనివర్సిటీలు అప్పగిస్తున్నారని గుర్తు చేశారు. సందర్భం వచ్చినప్పుడు ప్రజా తీర్పుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వెల్లడించారు. వచ్చే 15 ఏళ్లలో గోదావరి(Godavari water) నీటితో ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లా కాళ్లు కడగగలుగుతామా ఒక్కసారి ఆలోచించుకోవాలని ప్రజలను కోరారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూసిన అనేక మంది ఉద్యోగార్థుల కలలు అలాగే మిగిలిపోయాయని పేర్కొన్నారు. ఎన్నికల సమయం రాగానే ఉద్యోగ నోటిఫికేషన్లు వేశారని…గత ఎనిమిది ఏళ్లలో ఈ ఉద్యోగ నోటిఫికేషన్లు ఎందుకు విడుదల చేయలేదని సీఎం కేసీఆర్(cm kcr) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.