»Pm Cites The Kerala Story Accuses Congress Of Backing Terror Mindset
The Kerala Story: వివాదంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం దేశంలో వివాదాస్పద చిత్రంగా నిలిచిన సినిమా ది కేరళ స్టోరీ(the kerala story). విడుదలకు ముందే ఈ సినిమాపై దుమారం రేగింది. దీనిని థియేటర్లలో ప్రదర్శించకూడదు అంటూ.. పలువురు ఆందోళనలు కూడా చేపట్టారు. ఉగ్రవాద కుట్ర ఆధారంగా దీనిని తెరకెక్కించారు. కాగా, ఈ సినిమాపై తాజాగా ప్రధాని మోదీ(pm modi) స్పందించారు.
కర్ణాటక(karnataka)లోని బళ్లారిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ర్యాలీని ఉద్దేశించి పిఎం మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా ‘ది కేరళ స్టోరీ(The Kerala Story)’ చిత్రానికి తన మద్దతు ప్రకటించారు. ఈ చిత్రం కేరళలోని అసలు నిజాలను సత్యాన్ని చూపుతుందని.. అక్కడ జరిగిన ఆకృత్యాలను బహిర్గతం చేస్తుందని అన్నారు.
‘ది కేరళ స్టోరీ’ చిత్రం గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రం కేవలం కేరళ రాష్ట్రంలోని తీవ్రవాద శక్తులను బట్టబయలు చేసింది. ఈ చిత్రం ఉగ్రవాదుల పన్నాగాన్ని బట్టబయలు చేసింది. అలాంటి ఉగ్రవాదులతో కాంగ్రెస్ నిలబడటం దురదృష్టకరం. ఓటు నిషేధ రాజకీయాల కోసం శక్తులు పని చేస్తున్నాయి’ అని బళ్లారిలో ప్రధాని మోదీ(pm modi) సంచలన కామెంట్స్ చేశారు.
“ఇది ఇక్కడితో అంతం కాదు. కాంగ్రెస్(congress party) తలుపు వెనుక కూడా ఇటువంటి ఉగ్రవాద శక్తులతో వ్యవహరిస్తోంది. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్తో జాగ్రత్తగా ఉండాలి” అని మోడీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి లోలోపల ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూనే ఉందని, అందుకే వాళ్లకు ఇలాంటి విషయాలు పట్టవని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు.