»Hanuman Movie Postponement Is It Because Of Adipurush
Hanuman: ‘హనుమాన్’ వాయిదా.. ‘ఆదిపురుష్’ వల్లేనా!?
రామాయాణం ఆధారంగా ఒకేసారి రెండు సినిమాలు రాబోతున్నాయి. అవే ఆదిపురుష్(adipurush), హనుమాన్. ఈ రెండు సినిమాల బడ్జెట్‌కు అస్సలు సంబంధమే లేదు. ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా వస్తుండగా.. యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న హనుమాన్(Hanuman) బడ్జెట్ మాత్రం 20 కోట్ల లోపే ఉంటుందని అంటున్నారు. అయినా ఈ సినిమాను ఆదిపురుష్‌తో పోలుస్తున్నారు. అయితే తాజాగా హనుమాన్ రిలీజ్‌కు వాయిదా పడింది. మరి దానికి కారణం ఆదిపురుషేనా!?
ఆదిపురుష్(adipurush) టీజర్ పై ట్రోల్స్ రాగా.. హనుమాన్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆదిపురుష్ కంటే హనుమాన్(Hanuman) బెటర్.. అనే టాక్ సొంతం చేసుకుంది. అయితే హనుమాన్ టీజర్‌ను ఆదిపురుష్ టీజర్ తర్వాతే రిలీజ్ చేసిన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు సినిమాను కూడా అదే విధంగా ప్లాన్ చేస్తున్నట్టే కనిపిస్తోంది. ముందుగా హనుమాన్ మూవీని మే 12న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. కానీ ఇప్పుడు.. ఈ సినిమాను పోస్ట్‌పోన్ చేశారు.
ప్రస్తుతం తాము చెప్పిన డేట్‌కి సినిమా రావడం లేదని.. గ్రాఫిక్స్ వర్క్స్ కారణంగా.. వాయిదా(postponement) వేస్తున్నామని తెలిపారు. త్వరలోనే కొత్త డేట్‌ని అనౌన్స్ చేస్తామని ప్రకటించారు. ఇది ఖచ్చితంగా హనుమాన్ సినిమాకు కలిసొచ్చే అంశమే. జూన్ 16న ఆదిపురుష్ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా తర్వాతే హనుమాన్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టున్నారు మేకర్స్.
ఆదిపురుష్ రిజల్ట్‌ను బట్టి హనుమాన్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవచ్చు. అప్పటి వరకు గ్రాఫిక్స్ వర్క్స్(graphic works) కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అయితే మరో వెర్షన్ ప్రకారం.. ఆదిపురుష్ మేకర్స్ వల్లే హనుమాన్ పోస్ట్‌పోన్ చేశారనే టాక్ నడుస్తోంది. ఆదిపురుష్ కంటే ముందు హనుమాన్ వస్తే.. ఖచ్చితంగా ఈ సినిమాతో పోలుస్తారు ఆడియెన్స్.
హనుమాన్ బాగుంటే.. ఆదిపురుష్‌కు దారుణమైన ట్రోలింగ్(trolling) తప్పదు. అంచనాలు తలకిందులు అవుతాయి. అందువల్లే.. హనుమాన్ను వాయిందా వేయించారనే టాక్ నడుస్తోంది. ఇక తేజ సజ్జా, అమృతా అయ్యర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున ఈ సినిమాలో.. వరలక్ష్మి శరత్ కుమార్ కీ రోల్ ప్లే చేస్తోంది.